రామ్ చరణ్ చిత్రపై అశ్వనీదత్ ఖండన
హైదరాబాద్: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం పుణ్యమా అని మల్టి స్టారర్ చిత్రాలకు మళ్లీ ఊపొచ్చింది. ఈ నేపధ్యంలో త్వరలో వివిధరకాలైన హీరోల కాంబినేషన్ లో మల్టి స్టారర్ చిత్రాలు రానున్నట్లు వార్తలు వినిపిస్తునన్నాయి. రీసెంట్ గా ప్రముఖ నిర్మాత అశ్వనీదత్... ఓ భారీ మల్టి స్టారర్ చిత్రం రూపొందిస్తున్నారని వార్తలు వచ్చాయి. అందులో రామ్ చరణ్, వెంకటేష్ నటించినున్నారని మీడియోలో హోరెత్తింది. ఈ విషయమై మీడియావారు అశ్వనీదత్ ని కలిసారు. అయితే ఆయన ఈ న్యూస్ ని ఖండించారు.
వెంకటేష్, రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తాను నిర్మిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ ఓ ప్రముఖ మీడియా సంస్దకి తెలిపారు. వైజయంతీ మూవీస్ పతాకంపై వెంకటేష్, రామ్‌చరణ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం రూపొందనుందని, ఓ క్రేజీ దర్శకునితో అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం నిర్మించనున్నారని ఓ వార్త ప్రస్తుతం మీడియా లో హల్‌చల్ చేస్తోంది. ఈ విషయం గురించి అశ్వనీదత్‌ని వివరణ అడగ్గా ఆయన పై విషయాన్ని విశదపరిచారు.
వైజయంతీ మూవీస్ పతాకంపై ఓ భారీ ప్రతిష్టాత్మక చిత్రం త్వరలోనే ప్రారంభం కానుందని, ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తామని అశ్వనీదత్ తెలిపారు. ఇక రీసెంట్ గా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రవితేజ హీరోగా సారొచ్చారు చిత్రం రూపొందించి విడుదల చేసారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. పరుసరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏ వర్గాన్ని ఆకట్టుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications











