రికార్ట్ రేట్లకి చేరుకోవడంతోనే జూ ఎన్టీఆర్ ‘శక్తి’ సీక్వెల్ రేంజ్ కి వెళ్తోంది..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో త్వరలో విడుదలకి సిద్దమవుతున్న జూ ఎన్టీఆర్ చిత్రం శక్తిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అన్ని ఏరియాల్లో రికార్డు రేట్లకి అమ్ముడైన ఈ చిత్రం ఖచ్చితంగా అంచనాలకి తగ్గట్టే సూపర్ హిట్ అవుతుందని అశ్వనీదత్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని ఆయన అంటున్నారంటేనే శక్తిపై ఆయనకి ఏర్సడిన నమ్మకం ఏమిటనేది అర్థమవుతోంది. ఆయన అంతటితో ఆగిపోలేదు. ఈ చిత్రానికి తెలుగులో సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉన్నట్టు అశ్వనీదత్ పేర్కొన్నారు.
'శక్తి" ఫాంటసీ కథాంశమే అయినా మాస్ అంశాలు పుష్కలంగా ఉన్నాయని, మెహర్ రమేష్ అద్భుతంగా తెరకెక్కించాడని అశ్వనీదత్ చెప్పారు. ఎన్టీఆర్ పూర్తి శక్తి సామర్థ్యాలు తెలియజేసేలా ఈ చిత్రముంటుందని, ఇలియానా ఫెర్ఫామెన్స్ అద్బుతంగా ఉన్నాయని ఆయన అన్నారు. తెలుగులో వచ్చిన సినిమాల్లో టాప్ 20లో నిలిచే చిత్రమవుతుందని అశ్వనీదత్ ధీమాతో ఉన్నారు.
అంతే కాకుండా మరో ప్రక్క మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి"సీక్వెల్ కు స్క్రిప్ట్ ని రెడీ చేసే పని నిమగ్నం అయ్యారని సమాచరం. కాగా ఈ చిత్రం ఒరిజినల్ లో చిరంజీవి 'రాజు" పాత్రలో రామ్ చరణ్ తేజ ను నటింపచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











