twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    sita ramam: నేను నిర్మాతను కాకపోయినా అందుకే నా పేరు.. ప్రతి ఒక్కరికీ థాంక్స్: అశ్వినీదత్ !

    |

    స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మాణంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తక్కువ హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం సీతారామం. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అనే శీర్షికతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు సినిమా యూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు వగైరా సినిమా మీద ఆసక్తి పెంచేయగా తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా నిర్మాత అశ్వినీదత్ మాట్లాడిన విశేషాలు మీకోసం

    ప్రభాస్ కు థాంక్స్

    ప్రభాస్ కు థాంక్స్

    ముందుగా మైక్ అందుకున్న అశ్వినీదత్ సుమతో తాను హను రాఘవపూడి లాగా నేను కూడా చాలా సేపు మాట్లాడతాను అనుకుంటున్నారేమో చాలా తక్కువ సమయంలోనే అవగొట్టేస్తానని అంటూనే ముందుగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన ప్రభాస్ కు థాంక్స్ చెప్పారు. అలాగే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కారణమైన తన కుమార్తె స్వప్నకు కూడా థాంక్స్ చెప్పారు.

    స్వర్ణం యుగమే

    స్వర్ణం యుగమే

    ఇక హను రాఘవపూడి దగ్గర కథ ఉందని నాకు చెప్పగానే చేద్దామని అనుకున్నామని మరికొన్ని రోజులకే నాగి వచ్చి ప్రభాస్ కాల్ షీట్లు ఇస్తున్నాడని చెప్పడంతో ఇది మనకి స్వర్ణం యుగమే, ఇంక ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నానని అన్నారు. ఇక అలాగే పేరు పేరునా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి వారిని గుర్తు చేసుకుంటూ వారు సినిమా కోసం పనిచేసిన విధానాన్ని కూడా ఆయన కొనియాడారు.

    వివిధ లొకేషన్లలో

    ముఖ్యంగా సుమంత్ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా 160 నుంచి 170 రోజుల పాటు వివిధ లొకేషన్లలో షూటింగ్ జరిగిందని యూనిట్ ఎక్కడికి వెళితే అక్కడ కరోనా వెయిట్ చేస్తూ ఉందని చెప్పుకొచ్చారు.

    ఒళ్ళు దాచుకోకుండా

    ఒళ్ళు దాచుకోకుండా

    ఇలాంటి పరిస్థితుల్లో రష్యా గాని హిమాలయాలు కానీ అన్నిచోట్ల బ్రహ్మాండంగా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి షూటింగ్ చేశారు.. ఎప్పటికైనా ఒక మంచి లవ్ స్టోరీ చేయాలని ఎప్పటినుంచో అనుకునేవాడిని అది ఈ రూపేణా తీరిందని సినిమా చేసింది స్వప్న అయినా కావాలని నిర్మాతగా నా పేరు వేసిందని అన్నారు.

     ధన్యవాదాలు

    ధన్యవాదాలు

    ఇక అలాగే చివరిలో ఇద్దరు పేర్లు మర్చిపోయాను అని చెబుతూ సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ అలాగే ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు పేర్లను చెప్పిన ఆయన ప్రతి ఒక్కరిని పేరుపేరునా ధన్యవాదాలు చెబుతున్నానని సినిమా అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన ఆయన ముఖ్యంగా ప్రభాస్ కి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారని ఆ కష్టమంతా కచ్చితంగా తెరమీద కనిపిస్తుందని ఈ సందర్భంగా అశ్వినీదత్ అభిప్రాయపడ్డారు.

    English summary
    sita ramam movie is going to release on august 5th, here is the speech of of ashwinidutt.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X