Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఎన్టీఆర్ 'శక్తి' చిత్రం స్పెషాలిటీ అదే...అశ్వనీదత్
తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో, అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది..అదే "శక్తి" స్పెషాలిటీ అని నిర్మాత ఆశ్వనీదత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ ఆయన ఇలా స్పందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ఇలియానా, సయాజీషిండే, ప్రగతి, కొంతమంది ఫైటర్లపై ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో హెలికాఫ్టర్ ఉపయోగించి యాక్షన్ దృశ్యాలను తీస్తున్నారు.ఈ నెల 16న మొదలైన తాజా షెడ్యూలు చిత్రం పూర్తయ్యేవరకూ జరుగుతుంది.
ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు అందుస్తున్నారు. ఆయన సమకూర్చిన. ఆరు పాటల్లో ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. జాకీష్రాప్, పూజాబేడి, సోనూ సూద్ వంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్ సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే..దర్శకత్వం: మెహర్ రమేష్.