'రోబో' కలెక్షన్స్ తో పోటీ పడుతున్న ఎన్టీఆర్ 'శక్తి'
శంకర్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన రోబో చిత్రం కలెక్షన్స్ గురించి కథలు కథలుగా చెప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ రోబో టాపిక్ హాట్ గా మారింది.దానికి కారణం అశ్వనీదత్. ఆయన ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఈ రోజు (శనివారం) ఇచ్చిన ప్రకటనలో ఇలా రాసారు..ప్రేక్షక దేవుళ్ళకు పాదాభివందనాలు.. అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తి కొలువున్న 18 శక్తి పీఠాల విశిష్టతకు ప్రతీకగా మేము నిర్మించిన శక్తి చిత్రాన్ని ఆదరించి మీ ఆదరాభిమానాలతో మొదటివారమే ...ఆంధ్రప్రదేశ్ లో 19 కోట్ల 5 లక్షల 79 వేల 678 రూపాయల కలెక్షన్ మాపై కురిపించిన మీకు పాదాభివందనాలు. తెరమీద అద్వితీయమైన, అద్బతమైన దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించిన ప్రతీసారి ఆదరించి నిన్న రోబోతో, నేనడు శక్తితో రుజువు చేసిన మీకు నిండు మనస్సుతో సుమాంజలి...ఇట్లు సి.అశ్వనీదత్ అని ప్రకటన ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని రోబోతో పోల్చటం చాలా మందికి మింగుడు పడటం లేదు.


Click it and Unblock the Notifications











