రూటు మార్చిన అశ్వనీదత్

అలాగే అశ్వనీదత్ చిత్రం అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఎలక్షన్స్ వచ్చే లోగా మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అశ్వనీదత్ ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రం వర్కవుట్ అయితే రాజకీయనాయకులు తాము సంపాదించిన సొమ్ముతో సినిమా ఫీల్డ్ లో తమ వారసులను దింపటానికి ప్లాన్ చేస్తారనటంలో సందేహం లేదు. హిందీలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాసరావ్ దేశముఖ్ కుమారుడు రితీష్ దేశ్ ముఖ్ ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేస్తున్నారు. తెలుగులో సినిమాల్లో క్లిక్ అయ్యాక, రాజకీయాల్లోకి వెళ్ళటం ఆనవాయితీగా వస్తోంది. అది మారే సమయం ఆసన్నమయిందన్నమాట.


Click it and Unblock the Notifications











