twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు తరహాలో విజయ్ దేవరకొండ బిజినెస్: పవన్ కల్యాణ్‌తో ఓపెనింగ్.. ఫ్యాన్స్‌‌‌కు పండగే

    |

    సినిమా ప్రపంచంలో స్టార్ హోదా అనేది నమ్మకం లేనిది. ప్రస్తుతానికి బాగానే ఉన్నాము కదా అని భవిష్యత్తును ప్లాన్ చేసుకోకపోతే తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఎంతో కొంత తెలివిగా ఆదాయం వచ్చే మార్గాలను సిద్ధం చేసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం స్టార్స్ చాలా వరకు అదే తరహాలో కొత్త తరహా వ్యాపారాలను స్టార్ట్ చేశారు. ఇక త్వరలో విజయ్ దేవరకొండ కూడా మరో కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

    ఫ్యాషన్ వరల్డ్ లో

    ఫ్యాషన్ వరల్డ్ లో

    దాదాపు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ హీరోలకు ఒక ప్రత్యేకమైన వ్యాపారాలు ఉన్నాయి. కొందరు ఫుడ్ బిజినెస్ లోకి వెళితే మరికొందరు రియల్ ఎస్టేట్ తో బిజీగా ఉన్నారు. మరికొందరు ఫ్యాషన్ వరల్డ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా రౌడి వేర్ అంటూ న్యూ స్టైల్ క్లాత్ బిజినెస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

    మహేష్ బాబు సక్సెస్

    మహేష్ బాబు సక్సెస్

    ఇక త్వరలోనే విజయ్ మరొక కొత్త తరహా బిజినెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే మహేష్ ఆ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు. మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB సినిమాస్ ను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇండియాలోనే బెస్ట్ థియేటర్ గా AMB క్రేజ్ అందుకుంది.

    ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్

    ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్

    ఇక చాలా రోజుల తరువాత విజయ్ దేవరకొండ కూడా భారీ స్థాయిలో కొత్త బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. మహేష్ బాబు స్టైల్ లోనే ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ పేరుతో థియేటర్ ను నడిపించనున్నాడు. మహబూబ్ నగర్ లో తిరుమల అనే పాత థియేటర్ ను పూర్తిగా మార్చేసి ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్ గా మార్చబోతున్నారు. బిగ్గెస్ట్ స్క్రీన్ ను సెట్ చేయడంతో మహబూబ్ నగర్ లో భారీ క్రేజ్ ఏర్పడే ఛాన్స్ ఉంది.

    పవన్ కళ్యాణ్ తో ఓపెనింగ్

    పవన్ కళ్యాణ్ తో ఓపెనింగ్

    సినిమా థియేటర్ కు సంబంధించిన పనులన్ని కూడా మరికొన్ని రోజుల్లో ముగియనున్నాయి. అయితే సినిమా థియేటర్ పవన్ కళ్యాణ్ బొమ్మతోనే మొదలు కానుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆ రోజే పవర్ స్టార్ సినిమాతో గ్రాండ్ గా ఏషియన్ విజయ దేవరకొండ సినిమాస్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.

    English summary
    Star status in the film world is unbelievable. If we do not plan for the future, we will have a lot of trouble later. That is why we have to be very smart and prepare ways to earn income. Nowadays most of the Stars have started new types of businesses in the same vein. It is reported that Vijay Devarakonda is also going to start another new business soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X