జాన్ అబ్రహాంతో ఘర్షణ కు దిగిన అసిన్!??
కొన్ని రోజుల విరామం అసిన్ పాలిట వరంగా మారినట్టుంది. 'లండన్ డ్రీమ్స్" పరాజయం తర్వాత ఆత్మావలోకనం చేసుకున్న అసిన్ తనకు వచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకుంది. ఇలా అయితే బాలీవుడ్ లో నిలబడ్డం కష్టమే అనుకుంటోన్న దశలో అసిన్ కి వరుసగా పలు పెద్ద సినిమాల్లో ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే మూడు కొత్త హిందీ చిత్రాలను సైన్ చేసిన అసిన్ తాజాగా జాన్ అబ్రహాంతో కలిసి మరో చిత్రం చేసేందుకు సమాయత్తమవుతోంది.
ఇది తెలుగులో వెంకటేష్ నటించిన 'ఘర్షణ" కి రీమేక్. జాన్ అబ్రహాంతో నటించడానికి మొదట జెనీలియాను సెలక్ట్ చేశారు. అయితే ఆల్ రెడీ అబ్రహాం సరసన హూక్ య క్రూక్ సినిమాలో నటించిందని ఘర్షణలో అసిన్ అభినయం నచ్చడంతో ఆమెతోనే చేయాలని జాన్ పట్టుబట్టాడట. మే నెలలో సినిమా షెడ్యూల్ ప్రారంభిస్తారని సమాచారం. తమిళంలో సూర్య నటించిన 'కాక్క కాక్క" ఆధారంగానే 'ఘర్షణ" రూపొందింది. దీంతో 'గజిని" మాదిరి రిజల్టు తనకూ వస్తుందని జాన్ ఆశ పడుతున్నాడు.


Click it and Unblock the Notifications











