సైనస్ తో ఆసుపత్రి పాలైన ఆసిన్
గజిని కథానాయిక అసిన్ తొట్టంకల్ సైనస్‌తో భాదపడుతోందని, సైనస్ పరిస్థితి గురించి ఆమె కొంతకాలంగా బిజీ షెడ్యూల్ తో నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు కచ్చితంగా ఆస్పత్రికి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పారు. ముంబైలోని కోకిలాబెన్ లోని ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో రెండు రోజుల నుండి అసిన్ చికిత్స పొందుతున్నట్లు ఆమె తండ్రి జోషెప్ తొట్టంకల్ చెప్పారు. సైనస్ కారణంగా రెండు రోజుల ముందు ఆస్పత్రిలో చేరిన అసిన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, ఆమె మెల్లమెల్లగా కోలుకుంటుందని ఆయన అన్నారు.'లండన్ డ్రీమ్స్" చిత్రం కోసం లేట్ నైట్ షూటింగ్‌లో పాల్గొనడంతో సైనస్ సమస్య తీవ్రమైందని తెలిపారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో అసిన్ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
అసిన్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సైనస్ పరిస్థితి సరిగాలేకే ఆస్పత్రిలో చేరినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆమె విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆమె ఇప్పుడు కూడా చెలాకీగానే ఉందని సన్నిహితులు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











