అలసటలోనే ఆనందం:అసిన్

రెండు చోట్లా అసిన్ హీరోయిన్.ఇలా వరస ఆపర్స్ తో చెలరేగిపోతున్న ఆమెని మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకుంటున్నారు..అలసటం అనిపించటం లేదా అని అడిగాడు. దానికామె నేను పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటాను. ఎంత చేస్తే అంత ఆనందం పెరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇక రణ్‌బీర్ హీరోగా నటించే ఆ సినిమా తమిళ వెర్షన్ లో హీరో ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. జీవీ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. సైన్స్-ఫిక్షన్ తరహా కథాంశంతో తెరకెక్కబోయే ఈ చిత్రం రజనీకాంత్ నటిస్తున్న 'రోబో' మాదిరే ఉంటుందని తెలిసింది. అయితే అసిన్ తనకు లైఫ్ ఇచ్చిన హీరో సూర్య ని రికెమెండ్ చేస్తున్నట్లు వినికిడి.
అయితే నిర్మాతలు ఉషా వెంకటరమణి, మహదేవన్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు, మిగిలిన తారాగణం వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. వీరు ప్రస్తుతం హిందీలో గతంలో వచ్చిన 'ట్యాక్సీ నెంబర్ 9211' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేశారు. వచ్చే ఏడాది మరో నాలుగు యానిమేషన్ చిత్రాల్ని కూడా బహుభాషల్లో నిర్మించాలని యోచిస్తున్నారు. ఇక క్రిస్మస్‌కి 'గజిని' విడుదలవుతోంది. ఇందులో అమీర్ సరసన అసిన్ నటించింది. ఇది విడుదల అయ్యాక ఆమె దశ మరింత తిరుగుతుందని ఆసిస్తోంది. ఆమె ఆశ సఫలం కావాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











