లక్స్ పాపల లిస్ట్ లో మరో బ్యూటి సుందరి...!
హేమమాలిని, రేఖ, శ్రీదేవి, మాధురి దీక్షిత్, ఐశ్వర్య రాయ్, కత్రినాకైఫ్ వంటి సుందరాంగుల సరసన అసిన్ పేరు కూడా చేరిపోయింది. ఎందుకంటే ఈ భామకూడా తాజాగా 'లక్స్ సోప్" బ్రాండ్ అంబాసడర్ గా మారిపోయింది. పైన పేర్కొన్న బ్యూటీస్ అంతా లక్స్ కు ప్రచారకర్తలుగా పనిచేసిన వారేనన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న అసిన్ ఇటీవలే లక్స్ యాడ్ లో నటించింది. ఈ యాడ్ అతి త్వరలో చానల్స్ లో ప్రసారం చేయబడనుంది.
హిందీ 'గజిని" చిత్రంతో ఉత్తరాది ప్రేక్షకులకు చేరువయిన అసిన్ కు దక్షిణాదిన గల ప్రేక్షకాదరణ గురించి తెలిసిందే. కాబట్టి..నార్త్ తో పాటు సౌత్ లోనూ తమ బ్రాండ్ కు ప్రచారం కల్పించేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో అసిన్ తో లక్స్ యాజమాన్యం ఒప్పందం చేసుకుంది. 'గజిని" అనంతరం అసిన్ నటించిన 'లండన్ డ్రీమ్స్" నిరాశపరచడంతో ఆ చిత్రం తర్వాత అసిన్ కు ఉత్తరాదిలో ఏర్పడిన హవా కొంత తగ్గినప్పటికీ..ఇప్పుడు రెండు మూడు చిత్రాలలో నటిస్తూ..తన సత్తా చాటి చెప్పేందుకు సమాయత్తమవుతోంది. పనిలోపనిగా తమిళంలోనూ విజయ్ తో ఓ చిత్రంలో నటిస్తూ..హిందీలో తేడా వచ్చినా..తన కెరీర్ కు ఢోకా లేకుండా జాగ్రత్త పడుతోంది.


Click it and Unblock the Notifications











