పదేళ్ళ తర్వాత మళ్ళీ మాతృభాషలో మల్లు బేబి...!
ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా వున్న కథానాయిక అసిన్ మలయాళ అమ్మాయన్న సంగతి అందరికీ తెలిసిందే. సరిగ్గా పదేళ్ల క్రితం 'నరెంద్రన్ మకన్ జయకాంతన్ వాకా' అనే మలయాళ చిత్రం ద్వారా ఆమె సినిమా రంగానికి పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా తమిళ్, తెలుగు, హిందీ సినిమాలలో అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాంతో, మలయాళ సినిమాలు చేయడానికే ఆమెకు తీరిక దొరకలేదు.
అయితే, పదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ఆమె ఓ మలయాళ సినిమాని అంగీకరించింది. శ్యాం ప్రసాద్ డైరెక్షన్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తన మాతృభాషలో చేస్తున్నందుకు అసిన్ తెగ ఆనందపడిపోతోంది. ఈ సినిమాతో బాటు ప్రస్తుతం తను హిందీలో 'హౌస్ ఫుల్ 2', 'బోల్ బచ్చన్' చిత్రాలు చేస్తోంది. చేసేది తక్కువ సినిమాలే అయినా... మంచి సినిమాలు చేయాలన్నది తన ఆశ అని చెప్పే అసిన్, ప్రస్తుతం ఇలా ఒకేసారి మూడు సినిమాలు చేయడం విశేషమే!


Click it and Unblock the Notifications











