నిజం లేదు...రూమర్స్ అని కొట్టిపారేసిన అసిన్
మరికొన్ని హిట్స్ అందుకోవటం ద్వారా బాలీవుడ్ లోనే స్థిరపడింది. అసిన్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు, ఆమెకు కాబోయే వరుడు విదేశీయుడనే వార్తలు వినిపిస్తున్నాయి. అసిన్ మాత్రం వీటిని ఖండిస్తోంది.
అసిన్ మాట్లాడుతూ.. '' నా పాఠశాల, కళాశాల స్నేహితులు విదేశాల్లో ఉన్నారు. ఇప్పటికీ వారితో స్నేహం కొనసాగిస్తున్నా. సమయం దొరికినప్పుడల్లా వారి కోసం విదేశాలకు వెళ్తాను. అలా వెళ్లి వచ్చేసరికి నేను పెళ్లిచూపులకే విదేశాలకు వెళ్లినట్లు వార్తలు పుట్టిస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు''అని చెప్పింది.
ఇప్పటి వరకు అసిన్ బాలీవుడ్లో 6 సినిమాలు చేస్తే అందులో 4 సినిమాలు రూ. 100 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. దీంతో అసిన్ బాలీవుడ్ కెరీర్ బాగానే సాగుతోంది. 27 ఏళ్ల అసిన్, తన సక్సెస్ గ్రాఫ్ తో మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో చేరి పోయింది. అయితే పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఈ మధ్య కాలంలో ఆమె ఒక్క సినిమాకు కూడా కమిట్ కాలేదు.


Click it and Unblock the Notifications












