twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిజం లేదు...రూమర్స్ అని కొట్టిపారేసిన అసిన్

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో అమ్మా..నాన్న ..ఓ తమిళ అమ్మాయి,ఘర్షణ, లక్ష్మి నరసింహ వంటి చిత్రాల్లో నటించి తర్వాత బాలీవుడ్ కి తరలి వెళ్లిపోయిన మలయాళ ముద్దుగుమ్మ అసిన్‌. తమిళంలో గజిని లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న ఆమె ఇదే చిత్ర రీమేక్‌తో హిందీలోనూ అడుగుపెట్టింది.

    మరికొన్ని హిట్స్ అందుకోవటం ద్వారా బాలీవుడ్ లోనే స్థిరపడింది. అసిన్‌ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు, ఆమెకు కాబోయే వరుడు విదేశీయుడనే వార్తలు వినిపిస్తున్నాయి. అసిన్‌ మాత్రం వీటిని ఖండిస్తోంది.

    అసిన్ మాట్లాడుతూ.. '' నా పాఠశాల, కళాశాల స్నేహితులు విదేశాల్లో ఉన్నారు. ఇప్పటికీ వారితో స్నేహం కొనసాగిస్తున్నా. సమయం దొరికినప్పుడల్లా వారి కోసం విదేశాలకు వెళ్తాను. అలా వెళ్లి వచ్చేసరికి నేను పెళ్లిచూపులకే విదేశాలకు వెళ్లినట్లు వార్తలు పుట్టిస్తున్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదు''అని చెప్పింది.

    ఇప్పటి వరకు అసిన్ బాలీవుడ్లో 6 సినిమాలు చేస్తే అందులో 4 సినిమాలు రూ. 100 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. దీంతో అసిన్ బాలీవుడ్ కెరీర్ బాగానే సాగుతోంది. 27 ఏళ్ల అసిన్, తన సక్సెస్ గ్రాఫ్ తో మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో చేరి పోయింది. అయితే పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఈ మధ్య కాలంలో ఆమె ఒక్క సినిమాకు కూడా కమిట్ కాలేదు.

    English summary
    Asin has rubbished reports that she is marrying an NRI, calling it a "figment of someone's imagination." "There is no truth to the rumors doing the rounds that Asin will be getting married to a US citizen. Details of Asin's impending marriage are merely a figment of someone's imagination and should not be paid heed to. "Asin did make a trip to the US, however it was her annual family vacation and she was accompanied by her family to Los Angeles for a much-needed break. Hope this puts an end to the rumors," her spokesperson said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X