ఈసారి ఏకంగా బాద్షాపైనే కన్నేసిన ఆసిన్
దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వలస వెళ్లిన హీరోయిన్ ఆసిన్ అక్కడ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి పెద్ద స్టార్లతో సినిమాలు చేసే అవకాశం దక్కించుకుని మంచి పొజీషన్ లోనే కొనసాగుతోంది. పెద్ద హీరోలు, దర్శకులతో సన్నిహితంగా ఉంటేనే ఏమైనా చాన్సులు వస్తాయనే విషయం గ్రహించిన ఈ అమ్మడు తెలివిగా వ్యవహరిస్తూ వస్తూంది. అమీర్, సల్మాన్ తో పాటు.....అక్షయ్ కుమార్‌తో 'హౌస్ ఫుల్2', అభిషేక్ బచ్చన్‌తో 'బోల్ బచ్చన్ బోల్' లాంటి సినిమాల్లోనూ అవకాశం దక్కించుకుంది.
ఈ సారి ఆసిన్ చూపులు మరో బాలీవుడ్ టాప్ స్టార్, బాద్షా షారుఖ్ ఖాన్‌పై పడ్డాయి. ఏం మాయ చేసిందో తెలియదుగానీ షారుఖ్ ఖాన్‌తో నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సాజిద్ నడియావాలా ఈ చిత్రానికి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోందని, చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం.
దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్‌గా రాణించిన ఆసిన్..బాలీవుడ్‌లో మాత్రం ఆ స్థాయిలో రాణించలేక పోతుందనే చెప్పాలి. టాప్ హీరోల సరసన నటించినా.....కరీనా, కత్రినా, ప్రియాంక చోప్రాలకు పోటీ ఇవ్వలేక పోతోంది. మరి షారుఖ్ మూలంగా అయినా ఆసిన్ దశ తిరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











