అసిన్ ఇంటర్వ్యూ: మైక్రోమాక్స్ అధినేతతో పరిచయం, ప్రేమ ఇలా...
హైదరాబాద్: హీరోయిన్ అసిన్ త్వరలో మైక్రోమాక్స్ అధినేత రాహుల్ శర్మను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఆమె తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య పరిచయం ఎలా ఏర్పడింది, ప్రేమ ఎలా పుట్టింది, పెళ్లికి దారి తీసిన పరిణామాలపై ఆమె నోరు విప్పారు.
తమ మధ్య బంధం బలపడటానికి కారణం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అనే అసిన్ చెప్పుకొచ్చారు. రాహుల్, అక్షయ్ స్నేహితులు కావడమే ఇందుకు కారణం అంటోంది. అంతే కాదు తమ మధ్య సంథింగ్ మొదలైందని అక్షయ్ మొదట్లోనే కనిపెట్టేసి ప్రోసీడ్ అన్నాడట.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... రాహుల్ శర్మతో పరిచయం, ప్రేమ వ్యవహారం అనుకోకుండా జరిగిందని తెలిపారు. గజిని సినిమాలోలానే నా జీవితంలో జరిగింది. తొలిసారి ముంబై విమానాశ్రయంలో కలుసుకున్నామని తెలిపారు.

తొలి పలకరింపు
తొలుత నన్ను హాయ్ అంటూ పలకరించారు. తర్వాత విమానంలో పక్క పక్కనే కూచున్నాం. అప్పటి నుండి ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం అని అసిన్ తెలిపారు.

పెళ్లి ప్రపోజల్
ఒకానొక రోజు అతడే ఫోన్ చేసి చెప్పాడు. మీ ఇంట్లో వాళ్లను కలుస్తా. పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అతను జంటిల్మెన్‌లా ప్రపోజ్ చేసిన తీరు నచ్చిందని అసిన్ చెప్పుకొచ్చింది.

గజినీ
సౌత్ లో అసిన్ కు బాగా పేరు తెచ్చిన సినిమా ‘గజిని'. సౌత్ లో ఈ సినిమాలో సూర్య హీరోగా నటించగా... ఇదే సినిమాను బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసారు. ఈ సినిమాలో హీరో మొబైల్ కంపెనీ యజమాని. నిజ జీవితంలోనూ అసిన్ మొబైల్ కంపెనీ యజమానితో ప్రేమలో పడటం కాకతాళీయమే.

రాహుల్ కూడా గనిజీ
అచ్చం గజినీ సినిమాలో హీరోకు ఉన్న లక్షణాలే తనకు కాబోయే భర్తుకు ఉన్నాయంటోంది అసిన్. రాహుల్ గజిని టైపే. గజినిలో సంజయ్ సింఘానియా (సూర్య) ఓ మొబైల్ కంపెనీ ఓనర్. తర్వాత మతిమరుపు గజినిగా కనిపిస్తాడు. అందులో ఆరెంజ్ కలర్ కార్ ని వాడతాడు. ఇవన్నీ రాహుల్ నిజజీవితంలోనూ ఉన్నాయని అంటోంది అసిన్.


Click it and Unblock the Notifications











