గిరాకీ లేదు, హీరోయిన్ సొంత దుకాణం (ఫోటోలు)
హైదరాబాద్: సౌతిండియా చిత్ర సీమలైన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అసిన్....ఆ తర్వాత తన జెండాను బాలీవుడ్ లో పాతిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అగ్రహీరోలతో అవకాశాలు రావడంతో సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ అమ్మడు.
మొదట్లో అసిన్ కెరీర్ బాగానే సాసింది. అయితే రాను రాను అమ్మడుకి అవకాశాలు తగ్గటడం ప్రారంభమైంది. దీంతో సొంతగా నిర్మాణ సంస్థను స్థాపించాలని నిర్ణయించుకుంది అసిన్. ఇలా చేయడం ద్వారా బాలీవుడ్లో ఎక్కువ కాలం మనుగడ సాగించ వచ్చనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది.
ఆసిన్ స్థాపింబచోయే సొంత సినీ నిర్మాణ సంస్థ డీటేల్స్‌తో ఇతర వివరాలు స్లైడ్ షోలో......

సొంత బేనర్ ఎందుకంటే..
సొంత బేనర్‌ను స్థాపించాల్సిన అవసరం ఇప్పుడేముంది? అంటే గడుసుగా సమాధానం చెబుతోంది అసిన్. కొత్తవారికి అవకాశాలు ఇస్తూ చిన్న బడ్జెట్ సినిమాలు నిర్మించడమే లక్ష్యం అంటోంది ఈ భామ.

బాలీవుడ్ అవకాశాలు తగ్గాయి
బాలీవుడ్లో అవకాశాలు తగ్గడం వల్లనే సొంత బేనర్ స్థాపిస్తున్నారా? అంటే అస్సలు ఒప్పుకోవడం లేదు. తను ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నానని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోంది అసిన్.

మళయాలంలో..
తను స్థాపించబోయే సొంత ప్రొడక్షన్ సంస్థ ద్వారా తొలు మలయాళంలోనే సినిమాలు నిర్మిస్తానని అంటోంది అసిన్. ఈ నిర్మాణ సంస్థ బాధ్యతలను అసిన్ తండ్రి దగ్గరుండి చూసుకుంటున్నారట.

బాలీవుడ్ అవకాశాల కోసం
మరో వైపు అసిన్ బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకునేందుకు క్రమం తప్పకుండా ఫోటో షూట్లలో పాల్గొంటూ....తన సెక్సీ అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతోంది.

అసిన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు
2012లో వచ్చిన ఖిలాడీ 786 సినిమాలో కనిపించిన అసిన్ 2013లో ఏ సినిమాలోనూ నటించలేదు. 2014లో అభిషేక్ బచ్చన్ హీరోగా తెరకెక్కే ‘మేరే అప్నే', కమల్ హాసన్ హీరోగా రాబోయే సౌత్ మూవీ ‘ఉత్తమ విలన్' చిత్రంలో, 2015లో రాబోయే ‘మర్డర్-4' చిత్రంలో అసిన్ నటించబోతోంది.


Click it and Unblock the Notifications











