అప్పుడే అసిన్ మొదలెట్టేసింది

గజనీ సినిమా రిలీజ్ కు ముందు సైలెంట్ గా ఉండి చెప్పినట్లు వినే అసిన్ ఇప్పుడు కొత్త కొత్త డిమాండ్స్ తో నిర్మాతలను,స్క్రిప్టులో వేలుపెట్టి దర్శకులను విసిగిస్తోందని సమాచారం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో లండన్ డ్రీమ్స్ చిత్రంలో చేస్తున్న ఆమె టెక్నీషియన్లతో లెక్కలేని విధంగా ప్రవర్తిస్తోంది. దాంతో అసలు పూర్తి పొగరుతో ఉండే సల్మాన్ ఖాన్ కి ఏం చేయాలో అర్ధం కావటం లేదుట.
ఎందుకంటే అందరూ తలనొప్పితో బిహేవ్ చేస్తే తట్టుకునే దెవరు అన్నట్లు తయారైందిట. ఇక ఈ చిత్రం తెచ్చిపెట్టిన నడమంత్రపు విజయం ముఖ్యంగా మేకప్ ఆర్టిస్టులును, డిజైనర్లును బాగా ఇబ్బంది పెడుతోంది.దాంతో గజనీ హిట్టయింది కేవలం అమీర్ ఖాన్ వల్లే అంతేగాని అసీన్ కి సంభందం లేదు అని ప్రచారం చేస్తున్నారు.మరికొంత మంది అసిన్ అప్పుడే మొదలెట్టీసింది..మొన్న అమీర్ ని పట్టింది..ఇప్పుడు సల్మాన్ పట్టి ఇట్లా మాట్లాడుతోందంటున్నారు. ఇలా అయితే కష్టమే కదా అసిన్!!


Click it and Unblock the Notifications











