ఆఫర్లు కోసం గెస్ట్ హౌస్‌కు పిలుస్తోన్న హీరోయిన్!
హైదరాబాద్: మళయాలీ బ్యూటీ ఆసిన్ పలువురు బాలీవుడ్ హీరోలు, దర్శకులను తన గెస్ట్ హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానిస్తోంది. కేరళలోని కొట్టాయం సమీపంలో ఆసిన్ ఇటీవల ఓ గెస్ట్ హౌస్ కొనుగోలు చేసింది. పకృతి రమణీయతతో కూడిన ఈ ప్రదేశం ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉందట.
తన గెస్ట్ హౌస్‌కు రావాలని, ఇక్కడ కాస్త సమయం గడపాలని, పకృతి రమణీయతను ఆస్వాదించాలని అసిన్ కోరుతోంది. ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి ఇక్కడకు వచ్చి గడిపాడని, ఈ ప్రదేశం చాలా బాగుందని, రిలాక్స్ కావడానికి ఇదొక మంచి ప్రదేశమని అసిన్‌పై పొగడ్తల వర్షం కురిపించాడట.

అసిన్ పలువురిని తన గెస్ట్ హౌస్‌కు ఆహ్వానించడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోయిన ఆమె....ఇక్కడికి వచ్చే దర్శకులు, హీరోలను ఇంప్రెస్ చేసి ఆఫర్లు దక్కించుకోవడంలో భాగంగానే ఈ గెస్ట్ హౌస్ ప్లాన్ వేసిందని అంటున్నారు.
అసిన్ సినిమాల విషయానికొస్తే...అసిన్ నటించిన చివరి బాలీవుడ్ మూవీ 2012లో విడుదలైన కిలాడీ 786. ఆ సినిమా ప్లాపు కావడంతో అవకాశాలు పెద్దగా రాలేదు. ప్రస్తుతం 'ఆల్ ఈజ్ వెల్', 'షౌకీన్' అనే రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. మరి ఆఫర్లు దక్కించుకోవడానికి అసిన్ గెస్ట్ హౌస్ ప్లాన్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











