మిత్రుడికి చేయిచ్చిన ఆసిన్, రెడీ విజయంతో తలకెక్కిన పొగరు
రెడీ విజయంతో ఆసిన్‌కు పొగరు పెరిగినట్లు భావిస్తున్నారు. దాంతో పాత మిత్రులను కూడా లెక్క చేయడం లేదని తెలుస్తోంది. వారిలో నీల్ నితిన్ ముఖేష్ ఒకరు. నీల్‌తో స్నేహబంధాన్ని ఆసిన్ మరిచిపోయింది. ఇటీవలి దాకా వారిద్దరు మంచి మిత్రులు. ఆమెకు అవకాశాలు ఇప్పించడంలో కూడా అతను ప్రధాన పాత్ర పోషించాడు. అయితే, హృదయ శెట్టి చిత్రంలో నటించాలని నీల్ ఆసిన్‌కు సూచించాడట. దాన్ని ఆమె తిరస్కరించినట్లు చెబుతున్నారు. స్క్రిప్టు బాగా లేదని ఆమె మొహమాటం లేకుండా నీల్‌తో చెప్పేసిందట.
నీల్‌ను వదిలించుకోవడానికి ఆసిన్ చూస్తోందని, రెడీ విజయంతోనే ఆమె అలా ప్రవర్తిస్తోందని ప్రచారం జరుగుతోంది. రెడీ విజయం ఆమెను నిలువనీయడం లేదని, దాంతో ఆమె ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని అంటున్నారు. హృదయ్ శెట్టి వంటి దర్శకుడికి ఆసిన్ డేట్స్ ఇవ్వకపోవడం, నీల్ వంటి మిత్రుడిని ఖాతరు చేయకపోవడం ఎటు దారి తీస్తుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











