గజనీ ఆసిన్ ఇప్పుడు...'యూత్ ఐకాన్'
అసిన్ 'యూత్ ఐకాన్ ఆఫ్ కేరళ' గా ఎంపికైంది. కేరళకు చెందిన ఆసియా నెట్ ఛానెల్ వారు దాదాపు 15 రోజులు పాటు 'యూత్ ఐకాన్' పోటీ నిర్వహించింది. ప్రేక్షకులు ఎన్నుకున్నవారికి ఈ పట్టం కట్టబెడతామని ప్రకటించింది. ఈ పోటీలో 'యూత్ ఐకాన్ ఆఫ్ కేరళ'గా అసిన్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ అవార్డ్ ప్రదానోత్సవం ఇటీవల జరిగింది. నేటి యువతను రిప్రెజెంట్ చేసే తెలివి, ప్రతిభ, అందం ఆధారంగా ఆమెను ఎంపిక చేయటం జరిగిందని నిర్వాహకులు ప్రకటించారు. ఇక ఈ అవార్డుని అసిన్‌కి వీరాభిమాని అయిన ఏడేళ్ల పాప చేతుల మీదగా ఈ అవార్డ్ ప్రదానం జరిగింది. చిన్నారి అభిమాని కనబర్చిన అభిమానానికి అసిన్ కరిగిపోయారట. ఈ అవార్డ్‌లో భాగంగా అసిన్‌కు నగదు బహుమతి కూడా లభించింది. ఆ మొత్తాన్ని ఓ హాస్పటిల్ కి విరాళంగా ఇచ్చింది. ఇక అసిన్ ని ఈ అవార్డ్ వరించడం కేరళకే గర్వకారణం అనే అభిప్రాయాన్ని ఆమె అభిమానులు, మీడియా ఆనందం వ్యక్తం చేస్తోంది.


Click it and Unblock the Notifications











