ఆసిన్ ఆవిష్కరించిన బిగ్ ఎఫ్‌ఎమ్
హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు ఎఫ్.ఎమ్. రేడియో ప్రసారాలు జోరుగా సాగుతుండగా అగ్రగామి పారిశ్రామిక సంస్థ రిలయెన్స్ గ్రూప్ దేశంలోని పలు ప్రధాన కేంద్రాలలో బిగ్ ఎఫ్.ఎమ్. రేడియోను ప్రారంభిస్తోంది. దేశంలోని 45 ప్రధాన పట్టణాలలో ఈనెల 25 నుంచి బిగ్ ఎఫ్.ఎమ్. ప్రసారాలు ప్రారంభం కానున్నాయి. తొలి దశలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, కోల్‌కత, చెన్నై, బెంగుళూరు కేంద్రాలలో ప్రారంభించి తర్వాత ఇతర ప్రదేశాలలో ప్రసారాలు ప్రారంభించాలని రిలయెన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ నిర్ణయించింది. వచ్చే ఏడాది కల్లా బిగ్ ఎఫ్.ఎమ్. దేశంలోని 50 వేల గ్రామాలలో, వెయ్యి పట్టణాలలో తన నెట్‌వర్క్‌ని విస్తరింపజేయాలని సంకల్పించింది. ఈ కార్యక్రమాన్ని యాడ్‌లాబ్స్ రేడియోలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో బిగ్ ఎఫ్.ఎమ్. రేడియోను ప్రముఖ నటి ఆసిన్ శుక్రవారంనాడు లాంఛనంగా ప్రారంభించారు. టివి 9 టీవి యాంకర్‌గా సుప్రసిద్ధురాలైన స్వప్న హైదరాబాద్ బిగ్ ఎఫ్.ఎమ్. రేడియో చీఫ్ ఎగ్జిక్యుటివ్‌గా వ్యవహరించబోతున్నారు. స్వప్న తల్లిదండ్రులు ఇలియాస్, జ్యోత్స్న ఇద్దరూ ఆకాశవాణిలో సుప్రసిద్ధులు.


Click it and Unblock the Notifications