తగ్గలేదంటూనే.. ఆసిన్ ‘చిన్న’ చూపు!
సౌత్ నుంచి హీరోయిన్‌గా ఎదిగి బాలీవుడ్‌లో పర్మినెంట్‌గా పాగా వేయాలని ప్రయత్నిస్తున్న అసిన్ కోరిక అనుకున్నంత ఈజీగా నెరవేరేలా కనిపించడం లేదు. అడపాదడపా పెద్ద హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటున్నప్పటికీ ఆమె చాలా వెనకబడే ఉంది. క్రతినా, కరీనా, ప్రియాంక చోప్రా, విద్యాబాలన్ హవా కొనసాగుతుండటంతో అమ్మడుకి ఈ మధ్య అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ఆమె బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకోవడంతో అసిన్ అవకాశాలు లేకనే ఇటు వచ్చిందని చర్చించుకుంటున్నారు.
అయితే అసిన్ మాత్రం ఈ వాదనను అస్సలు ఒప్పుకోవడం లేదు. “నాకు స్నేహమంటే ఇష్టం. స్నేహానికి విలువిస్తా. అందుకే ఫ్రెండ్ షిప్‌కు సంబంధించిన బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనడానికి ఒప్పుకున్నా" అని అంటోంది. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే నేరుగా అభిమానులను కలుసుకుని మాట్లాడవచ్చు. మాలాంటి తారల నుంచి వారు ఎలాంటి చిత్రాలు కోరుకుంటున్నారో తెలుసుకోవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే టీవీ షోలో పాల్గొనడానికి ఒప్పుకున్నా" అని చెప్పుకొస్తోంది. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం వెండి తెరపై అసిన్ క్రేజ్ తగ్గడంతోనే...ఆమె చిన్న తెరవైపు చూపులు మళ్లించిందని ఖరాకండిగా చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











