అసిన్ కి మళ్ళీ మొదలయ్యింది
'గజిని' చిత్రంతో బాలీవుడ్ కు పరిచయమైన అసిన్ కి రెండో చిత్రం 'లండన్ డ్రీమ్స్' ప్లాప్ తో కలలన్నీ కరిగిపోయాయి. అంతా ఆమె చెన్నై వెళ్ళిపోవాల్సిందే.. వేరే దారి లేదు అనుకుంటున్న సమయంలో సల్మాన్ ఖాన్ ఆదుకున్నాడు. జెనీలియా,రామ్ ల 'రెడీ' హిందీ రీమేక్‌లో సల్మాన్ తన సరసన ఆమెకు ఆఫర్ ఇప్పించాడు. అలాగే ఆమె తాజాగా రణబీర్‌కి జోడీగా కూడా ఓ చిత్రంలో ఎంపికయ్యింది. మొదట్లో ఈ పాత్ర గురించి కత్రినా కైఫ్‌ని సంప్రదించారు. కాని డేట్స్ సమస్య కారణంగా కత్రినా కాదన్నారు. దాంతో ఈ పాత్ర అసిన్‌ని వరించింది. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ని కూడా ఆమె అంగీకరించారని సమాచారం. దాంతో బాలీవుడ్‌లో అసిన్ పని అయిపోయింది అని విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు సైలంట్ అయిపోయి షాకింగ్ గా చూస్తున్నారు. వీటితో పాటు ఆమె తమిళంలో విజయ్‌తో 'బాడీగార్డు' చిత్రం రీమేక్‌లో చేయటానికి అంగీకరించింది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో పోకిరి రీమేక్ వచ్చి సూపర్ హిట్ అయ్యింది.


Click it and Unblock the Notifications











