Don't Miss!
- Sports PBKS vs MI: ఆ తప్పిదంతోనే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: సామ్ కరణ్
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ హీరోయిన్ గట్స్ కి హీరోగారు హాట్సాఫ్...!
'గజనీ' చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అసిన్ ఇప్పుడక్కడ సల్మాన్ ఖాన్ తో తెలుగు 'రెడీ' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ అవకాశాన్ని సల్లుభాయే ఇప్పించాడని కూడా మరో న్యూస్. అంతేకాదు ఈ తారపై కండల వీరుడు ప్రసంసల వర్షం కురిపిస్తూ ఆమె సాన్నిహిత్యం తనకు ఆనందం కలిగిస్తుందని చెబుతున్నాడు.
'లండన్ డ్రీమ్స్' లో ఇద్దరు నటించినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమాయణం కూడా కొనసాగిందని, సల్మాన్ ఆమెపై మనసు పారేసుకున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు కూడా వినిపించాయి. ఇప్పుడు 'రెడీ' షూటింగ్ లో కూడా వీరిద్దరూ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇదిలావుంటే 'రెడీ' సినిమాలో ఓ సన్నివేశంలో హీరో హీరోయిన్ లూ చెట్టుకొమ్మ పట్టుకొని వేలాడుతుంటారు. అదే సన్నివేశాన్ని ఈ జంటపై చిత్రీకరిస్తున్నపుడు అసిన్ గట్స్ చూసి సల్మాన్ తెగ ఇంప్రెస్ అయ్యాడట. ఆమెకు గుండె ధైర్యం ఎక్కువని, ఆమె పక్కన నటించడం తన అదృష్టమని తన స్దాయిని తగ్గించుకొని మరీ సల్మాన్ మాట్లాడారని తెలిసింది.
సల్మాన్ అలా వ్యాఖ్యానించడం చాలా గొప్ప విషయమనీ, 'రెడీ" సినిమా తన కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిపోతుందని అసిన్ థీమా వ్యక్తం చేస్తోంది. కాగా సల్మాన్, అసిన్ లు ఇస్తోన్న స్టేట్ మెంట్స్ బాలీవుడ్ జనానికి బీభత్సమైన జోకులు వేసుకుంటున్నారు.