అభికి జంటగా ఐష్ స్థానంలో అసిన్
దక్షిణాది నుండీ బాలీవుడ్ కు వలస వెళ్లిన కేరళ కుట్టి అసిన్ కు గజిని సినిమా మంచి పేరు తెచ్చిపెట్టడంతో అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం 'లండన్ డ్రీమ్స్' చిత్రంతో బిజీగా వున్న అసిన్ ను ఓ అరుదైన అవకాశం వచ్చింది. లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ వంటి అద్భుత కళాఖండాలను తీర్చిదిద్దిన అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో నటించే అవకాశం అనుకోకుండా ఈమెను వరించింది. అభిషేక్ బచ్చన్ కథానాయకుడుగా నటిస్తున్న ఈ చిత్రంలో తొలుత విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ను కథానాయికగా తీసుకోవాలని భావించినా ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో అసిన్ ను ఈ అవకాశం వరించింది. అశుతోష్ దర్శకత్వంలో అనే సరికి అసిన్ వెంటనే ఒప్పుకొందట. ఏదైతేనేం మన దక్షిణాది కుట్టికి బాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయనమాట.
అసిన్ ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ అశుతోష్ గోవారికర్ బాలీవుడ్ asin aishwaryarai bachachan abhishek bachchan ashutosh gowarikar


Click it and Unblock the Notifications