రజనీకాంత్‌తో అవకాశం చేజారినందుకు చింతిస్తున్నా: ఆసిన్
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం కోల్పోవడంతో తెగ బాధ పడుతోంది హీరోయిన్ ఆసిన్. సౌతిండియాలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన అసిన్, ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసిన్ అడపాదడప సినిమాలతో నెగ్గుకొస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
మీరు సౌత్ లో మంచి హీరోయిన్ గా ఎదిగారు, కానీ ఇప్పటికీ రజనీకాంత్ తో నటించే అవకాశం దక్కించుకో లేదు, కారణం ఏమిటి? అని మీడియా అడిగి ప్రశ్నకు ఆసిన్ స్పందిస్తూ...గతంలో తనకు రజనీకాంత్‌తో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయిందని, అందుకు తాను చాలా బాధ పడ్డానని అసిన్ చెప్పకొచ్చింది. రజనీని నేను చాలా సార్లు సినిమా ఫంక్షన్లలో కలిశాను, ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఎప్పటికైనా ఆయనతో నటించే అవకాశం దక్కించుకుంటారు అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.
బాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తున్నమీరు...సౌత్ లో మాత్రం మల్టీ స్టారర్ చిత్రాలను ఎందుకు తిరస్కచించారు? అన్న ప్రశ్నకు ఆసిన్ తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది. సౌత్ లో తనకు అలాంటి అవకాశాలేమీ రాలేదని, అక్కడ అన్నీ పెద్ద సిసిమా చాన్సులే వచ్చేవని చెప్పకొచ్చింది. ప్రస్తుతం తాను హిందీంతో హౌస్ ఫుల్2 చిత్రంలో నటిస్తున్నట్లు ఆసిన్ స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











