సల్మాన్ నన్ను పెళ్శి చేసుకోలేదు, అదంతా ఉత్తుత్తి పెళ్శంటున్న హీరోయిన్
దబాంగ్ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ మరలా పూర్వవైభవం తెచ్చుకున్నారు. ఈవైభవాన్ని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఆచితూచి మంచి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి సల్మాన్ ఖాన్ రెడీ రీమెక్ లోనటిస్తున్నారు. ఈసినిమాలో సల్మాన్ ఖాన్ తోపాటు హీరోయిన్ గా ఆసిన్ నటిస్తున్నారు. వీరిద్దరి మద్య వచ్చినటువంటి కొన్ని రోమాంటిక్ సన్నివేశాలకు అభిమానులు మంత్రముగ్దులు అవుతున్నారని సమాచారం. ఇటీవల ఓ ఛానెల్ కార్యక్రమంలో ఆసిన్ సల్లు భాయ్ గురించి ఈవిధంగా అన్నారు. సల్మాన్ మంచి నటుడే కాదు...మంచి జోకర్ కూడా. తనతో మాట్లాడుతుంటే కాలం ఇట్టే గడిసిపోతుంది. ప్రాక్టికల్ జోకులు వేసి ఒక్కోసారి ఇబ్బందులకు కూడా గురిచేస్తారాయన. మనకు కోపం వచ్చిందనుకోండి...మళ్లీ వెంటనే నవ్వించేస్తారు.
ఇలా సల్మాన్ గురించి కబుర్లు చెప్పాల్సిన అవసరం అసిన్‌కి ఏంటి...అనుకుంటున్నారా? విషయం ఏంటంటే...వీరిద్దరూ బాలీవుడ్‌లో 'రెడీ" రీమేక్‌లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైన నాటి నుంచి వీరి మధ్య ఎఫెక్షన్ బాగా ముదిరిందని, ఒకర్ని వదిలి ఒకరు ఉండలేకపోతున్నారని బాలీవుడ్‌లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అంతేకాక, 'రెడీ" సినిమాలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు గెటప్‌లో ఉన్న వీరిద్దరి స్టిల్ ఈ మధ్య బయటకు వచ్చింది. ఇక బాలీవుడ్ జనాలు ఈ స్టిల్ చుట్టూ కథలు అల్లేస్తూ...వీరిద్దరికీ పెళ్లి కూడా అయిపోయిందని చెప్పడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానల్ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొనడం జరిగింది.
ఆ కార్యక్రమంలో సదరు యాంకర్ ఈ ఫొటో మేటర్‌ని బయట పెట్టి.. దీనికి మీ సమాధానం ఏంటని సల్మాన్‌ని అడగగా ఆయన సమాధనమిస్తూ అబ్బా..ఈ గాసిప్ నిజమైపోతే ఎంత బావుండో అంటూ అసిన్ వంక అదోలా చూస్తూ మెలికలు తిరిగిపోయారంట. లక్షలాది మంది చూసే కార్యక్రమంలో సల్మాన్ అలా ప్రవర్తించే సరికి అసిన్ కాస్తంత ఇబ్బందిగా ఫీలైపోతూ ఈయన భలే జోకులు వేస్తారు. అవన్నీ ఉత్తుత్తి గాలి కబుర్లు. వాటిని లెక్క చేయాల్సిన పనిలేదు. ఆ స్టిల్ మేం సినిమా కోసం ఇచ్చిందే అని కవర్ చేసిందంట. ఇది విన్నటువంటి చాలా మంది నిప్పులేనిదే పోగరాదుగా అని అంటున్నారంట.


Click it and Unblock the Notifications











