అతిలోక సుందరి శ్రీదేవికి అదిరిపోయే షాక్ ఇచ్చిన అసిన్
అతిలోక సుందరిగా పిలవబడే శ్రీదేవికి..అసిన్ షాక్ ఇచ్చిందంటూ బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా చెప్పుకుంటున్నారు. నిజానికి అసిన్ కు ముంబైలో అండదండ..శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్. అసిన్ ఒంటిరిగా తన ప్లాట్ లో తానుంటూ హోమ్ సిక్ అవుతున్న సమయంలో వీళ్ళిద్దరూ ఆదుకున్నారు. అలాగే అనవసర వివాదాల్లో ఇరుక్కోకుండా ఆమెను బోనీ కపూర్ చాలా సార్లు తన పరపతిని ఉపయోగించి మీడియాని మానుప్లేట్ చేసి కాపాడారు. అంతేగాక అసిన్ కి శ్రీదేవి రెగ్యులర్ గా తన స్వంతంగా చేసిన వంటకాలను పంపుతూ ఎంగేజ్ చేస్తూండేది. ఇవన్నీ గుర్తుంచుకుంటుందనే నమ్మకంతో బోనీకపూర్ తన తదుపరి చిత్రంలో హీరోయిన్ గా ఆమెను అడిగారు. అయితే అక్కడే అసిన్ ట్విస్ట్ ఇచ్చింది. మొహమాటం లేకుండా నో చెప్పి షాక్ ఇచ్చింది. తాను చాలా బిజీగా ఉన్నానని చెప్పి సారి చెప్పింది. నిన్నటి వరకూ బాలీవుడ్ ప్రముఖులకు పరిచయం చేయండంటూ తమ చుట్టూ తిరిగిన అసిన్ ఇలా షాక్ ఇవ్వటం ఆ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు.


Click it and Unblock the Notifications











