అనుష్కను వదిలేసి అసిన్‌ను ఇబ్బంది పెడుతున్నారు!
హైదరాబాద్: కోరి కొరివితో తల గోక్కోవడం అంటే ఇదేనేమో. తాజాగా హీరోయిన్ అసిన్ చేసిన పని చూస్తే అలానే అనిపిస్తోంది. ఓ వైపు టీమిండియా సెమీస్‌లో ఓటమి పాలై క్రికెట్ అభిమానులంతా నిరాశలో ఉన్నారు. తమ కోపాన్నంతా విరాట్ కోహ్లి ప్రియురాలు అనుష్క శర్మ మీద చూపుతున్నారు. ఇలాంటి సమయంలో అనుష్కకు సపోర్టుగా వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ అసిన్ కోరి ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లయింది.
అనుష్క శర్మ సెమీస్ ఫైనల్ రోజు ఆస్ట్రేయలియా రావడం వల్లే కోహ్లి ఏకాగ్రత దెబ్బతిని ఒకే పరుగుకు ఔటయ్యాడని క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్న సంగతి తెలిసిందే. ‘టీమిండియా ఓటమికి అనుష్కకు సంబంధం ఏమిటి అని...ఆమెను కారకురాలిని చేయడం రెడిక్యులెస్' అంటూ ట్వీట్ చేసింది.
దీంతో క్రికెట్ అభిమానులు అనుష్కను వదిలేసి అసిన్ మీద పడ్డారు. ఏకంగా అసిన్ పేరు మీద నకిలీ అకౌంట్, వెబ్ సైట్ల క్రియేట్ చేసి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచని ఆసిన్ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది.

ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన భామ ఆసిన్. ప్రస్తుతం సౌత్ సినిమాలకు పూర్తిగా ఉంటున్న ఈ భామ బాలీవుడ్లోనే కొనసాగుతోంది. బాలీవుడ్లో ఆమె తొలి చిత్రం ‘గజినీ' భారీ విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత అమ్మడుకి పెద్దగా కలిసి రాలేదు.
2012 తర్వాత ఏ సినిమాలోనూ నటించని ఆమె ఈ సంవత్సరం ‘ఆల్ ఈజ్ వెల్' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించబోతున్న ఈచిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తున్నాడు. జూలైలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











