అసిన్ ఆ సస్పెన్స్ చెప్పదట?
తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ... తాజాగా హిందీ సినిమాలలో అవకాశాల వెల్లువతో ఈ సంవత్సరం అసిన్ ఉత్సాహంగా ఉంది. ఆమె సంతోషంలో మునిగితేలుతుండగానే అక్టోబర్ 26 రానే వస్తోంది. ఆ రోజు ఆమె పుట్టిన రోజు మరి. ఈ సంవత్సర సంతోషాన్ని తన జన్మదినోత్సవంతో మరింత రెట్టింపు చేసుకోవాలని అసిన్ యోచిస్తోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ లో చేరి అయిదేళ్లయినా ఈ మారు మాత్రం జన్మదినోత్సవాన్ని భారీగా జరుపుకోవాలనుకోవడంలో ఉద్ధేశం మనకు తెలియదుకానీ కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పెద్దయెత్తున జరుపుకోవాలనుకుంటోంది. ఈ జన్మదినోత్సవాన్ని చెన్నయ్ లో రోజంతా జరుపుకుంటుందట. ఆ రోజు తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుందట. ఏం చేస్తుందనేది మాత్రం అప్పటికి సస్పెన్స్ అట. త్వరలో మీడియాకు ఆమె స్వయంగా వెల్లడిస్తుందట. జన్మదినోత్సవం రోజున ఫ్యాన్స్ క్లబ్, ఛారిటబుల్ ట్రస్ట్ ను అసిన్ ప్రారంభించనున్నట్టు విశ్వనీయ వర్గాల భోగట్టాయ. ఇది సరే ఈ సంవత్సరం ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం అమీర్ ఖాన్ అయితే కాదు కదా. ఆమీర్ తో హిందీ గజినీ చేస్తున్నప్పటినుంచి అసిన్ లో మార్పులు చాలా కనిపిస్తున్నయి మరి.


Click it and Unblock the Notifications











