అభిషేక్‌ను టార్గెట్ చేసిన ఆసిన్
సౌత్ నుంచి బాలీవుడ్ లో అడుగు పెట్టిన అసిన్....అక్కడ తనకు సపోర్టును ఇచ్చే వారు ఎవరూ లేక పోవడంతో, ఏ హీరోతో నటిస్తే ఆ హీరోను కాకా పట్టడం, చెట్టెక్కించి అవకాశాలు రాల్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందట. ఆ మధ్య సల్మాన్ తో చాలా వ్యవహారం గురించి కొత్తగా చెప్పాల్సిన పనే లేదు. ఇప్పడు సల్మాన్ తో అవసరం తీరడంతో అభిషేక్ బచ్చన్ ను టార్గెట్ చేసింది అసిన్.
అసిన్ చేతిలో ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. ఇందులో ఒకటి సాజిద్ నడియా వాలా నిర్మిస్తున్న 'హౌస్‌ఫుల్-2" ఒకటి కాగా, 'సింగమ్" దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్న 'బోల్ బచ్చన్" చిత్రం మరొకటి. అజయ్‌దేవగన్, అభిషేక్ బచ్చన్, ప్రాచీ దేశాయి ఇందులో నటిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌లో అసిన్ పాల్గొంటోంది. ఈ చిత్రం గురించి అసిన్ మాట్లాడుతూ 'గతంలో రోహిత్ శెట్టి రూపొందించిన 'గోల్‌మాల్" చిత్రాలు ఏ స్థాయిలో వినోదాన్ని అందించాయో 'బోల్ బచ్చన్" చిత్రం కూడా ఆదే స్థాయిలో ఎంటర్‌టైన్ చేస్తుంది. ఇందులో అజయ్, అభిషేక్‌లతో కలిసి నటిస్తున్నాను..అని చెప్పడంతో పాటే కామెడీని పండించడంలో అభిషేక్ టైమింగ్ గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. 'లండన్‌వూడీమ్స్" తర్వాత అజయ్‌తో కలిసి నటిస్తున్నాను. ఈ చిత్రం మాకు మంచి విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను'అని తెలిపింది అసిన్. ఇలా మాటల మధ్యలో అభిషేక్ ను పొగడ్తలతో ముంచెత్తడం వెనక ఆసిన్ కు భారీ ప్రణాళికే ఉందట.


Click it and Unblock the Notifications











