twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న అసిన్

    By Bojja Kumar
    |

    ముంబై : సౌతిండియా చిత్ర సీమలైన టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లలో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ అసిన్....ఆ తర్వాత తన జెండాను బాలీవుడ్ లో పాతిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో అగ్రహీరోలతో అవకాశాలు రావడంతో సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమైంది ఈ అమ్మడు. ఇప్పటి వరకు అసిన్ బాలీవుడ్లో 6 సినిమాలు చేస్తే అందులో 4 సినిమాలు రూ. 100 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలుగా నిలిచాయి. దీంతో అసిన్ బాలీవుడ్ కెరీర్ బాగానే సాగుతోంది.

    27 ఏళ్ల అసిన్, తన సక్సెస్ గ్రాఫ్ తో మోస్ట్ వాంటెడ్ బాలీవుడ్ హీరోయిన్ల లిస్టులో చేరి పోయింది. అయితే పలు సినిమాల్లో అవకాశాలు వస్తున్నా ఈ మధ్య కాలంలో ఆమె ఒక్క సినిమాకు కూడా కమిట్ కాలేదు. విషయం ఏమిటా అని ఆరా తీసిన మీడియా వారు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నారు.

    మీడియా రిపోర్ట్స్ ప్రకారం అసిన్ రహస్య వ్యక్తితో ప్రేమలో పడిందని, అమెరికాలో ఉంటున్న అతనితో త్వరలో పెళ్లికి రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ మధ్య అసిన్ తరచూ అమెరికా వెళ్లి వస్తుండటానికి కారణం అతడేనని, అతనితో గడిపేందుకే అసిన్ తరచూ అమెరికా వెలుతోందని అంటున్నారు. ప్రస్తుతం అసిన్ సినిమాల కంటే జీవితంలో సెటిల్ కావాలనే ఆలోచనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే సినిమాలేవీ ఒప్పుకోవడం లేదని అంటున్నారు.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో...

    బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న అసిన్

    ఈ సంవత్సరంలో తన బాయ్ ఫ్రెండ్ తో అసిన్ వివాహం ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

    బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న అసిన్

    ఈ మధ్య కాలంలో ఆమె సినిమాలు ఒప్పుకోక పోవడానికి తనకు తగిన సరైన కథలు లేక పోవడంతో పాటు, సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ కూడా ఓ కారణమని అంటున్నారు.

    బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న అసిన్

    దక్షిణాది సినీ పరిశ్రమలో పాటు బాలీవుడ్లోనూ సక్సెస్ ఫుల్ సినిమాలతో నిలదొక్కుకున్న అసిన్ ప్రస్తుతం చాలెంజిగ్ సినిమాలపై దృష్టి పెట్టింది.

    బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న అసిన్

    మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సంవత్సరం అసిన్ మళ్లీ తమిళ సినిమాల్లోకి రాబోతోందట.

    బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడబోతున్న అసిన్

    ఓ ప్రముఖ తమిళ ఫిల్మ్ మేకర్ తన తర్వాతి సినిమాలో అసిన్ ఓప్పించే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ కాలేదు.

    English summary
    
 Asin Thottumkal, who rose up to a top position in South films before moving to Bollywood, has made it big in Hindi film industry. Through her hard work and performance, the actress has created a niche for herself in B-Town. It has to be noted that out of six Hindi flicks, four of her flicks have joined the 100-crore club. However, the 27-year old, in spite of being most-wanted girl, has not signed any movie in the recent months that has left media to find out the real reason behind her refusal to give a nod to projects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X