తిరుగుళ్ళుకు అడ్డమనే అసిన్ అలా..

దాంతోటి అతన్ని తీసేయటానికి నిర్ణయించుకున్నానని,ఎవరైనా సీనియర్ మేనేజర్ ఉంటే చెప్పమని తెలిసిన వాళ్ళందరిని ప్రాధేయపడుతోంది.అసలు ఏం జరిగింది..అసిన్ ఇలా హఠాత్తుగా మేనేజర్ పై యుధ్ధం ప్రకటించింది అంటే...మేనేజర్ కి ఇక్కడ బాలీవుడ్ లో అసిన్ చేస్తున్న కొత్త కొత్త వ్యవహారాలు నచ్చటంలేదని,కెరీర్ పోతుందని హెచ్చరించాడనీ,అందులోనూ మొదటి నుంచి తనగురించి పూర్తి స్ధాయిలో తెలుసున్న వాడు ఎదుగుతున్న దశలో ప్రక్కనుండటం ప్రమాదమని ఆమె భావిస్తోంది.
అంతేగాక అమీర్ తో ఆమె అతి చనువుని,లండన్ డ్రీమ్స్ సినిమా షూటింగ్ లో బర్తడే ఫంక్షన్ కి సల్మాన్ ఖాన్ ఇచ్చిన గిప్టు తీసుకోవటాన్ని అతను తీవ్రంగా వ్యతిరేకించాడని చెప్తున్నారు. అంతేగాక కొత్తగా ఆమె లేట్ నైట్ పార్టీలుకు వెళ్తోందని,పబ్ సంస్కృతికి అలవాటు పడుతోందని ఇలా అయితే చాలా కష్టమని పెద్దరికంగా మందలించాడు. దాంతో మండిన అసిన్ అలా అన్నిటిలో వేలు పెట్టవద్దని హధ్దుల్లో ఉండమని అతనికి వార్నింగ్ ఇచ్చి ఇలా కొత్త మేనేజర్ వేట ప్రారంభించిందిని బాలీవుడ్ లో గుసగుసలాడుతున్నారు.


Click it and Unblock the Notifications











