అసిన్ అసలు విషయం

మరేంటి అసలు విషయం ...అని ఎంక్వైరీ చేస్తే అసిన్ సినిమాలు ఒప్పుకోక పోవటానికి అసలు కారణం బయట పడింది. ఈ మధ్య ఆమె హిందీ గజనీ లో అమీర్ ఖాన్ సరసన తాను ఒరిజనల్ లో చేసిన పాత్రనే చేస్తోంది. అంతేగాక కమల్ దశావతారంలోను హీరోయిన్ గా చేసింది. ఈ రెండు త్వరలో రిలీజవుతాయి. దాంతో అవి హిట్టయి బాలీవుడ్, కోలీవుడ్ లలో నెంబర్ వన్ హీరోయిన్ అవుతానని ఆమె ప్రగాఢంగా నమ్ముతోంది. ఆ ఇమేజితో తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఇక వరస సినిమాలకు గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలను పెద్ద ఎమౌంట్ కి చెయ్యచ్చని ఆశ పడుతోంది. ఈలోగా యే సినిమా అన్నా కమిట్ అయితే అన్ని రకాలుగా నష్టపోతానని అనుకుంటోంది. ఆలోచన, అవగాహన మంచిదే కాని యే సినిమా హిట్టవుతుందో ఎవరికి ఎరుక...రిలీజయ్యాక సీన్ రివర్స్ అయితే పరిస్థితి యేంటి అని కొందరు వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications











