నటిపై అత్యాచారం...స్పాట్‌బాయ్ అరెస్టు
పరేల్ : తాజాగా మరో రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తున్న ఒక వర్ధమాన నటిపై స్పాట్‌బాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను ఫైనాన్షియర్‌నని, పెద్ద బ్యానర్ల చిత్రాల్లో పాత్రలు ఇప్పిస్తానంటూ స్పాట్‌బాయ్ ముస్తఫా మసూద్ అలీ ఖాన్ (23) ఆమెను నమ్మించి రేప్ చేసాడు. అయితే పోలీస్ లు అతన్ని అరెస్టు చేసారు.
ఈ విషయమై గోరెగావ్ ఇన్‌స్పెక్టర్ రేకుల్‌వాడ్ మాట్లాడుతూ.. ఆమె సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తోంది. పాత్రకు రూ.50 వేలు కావాలనుకుంటోంది. ఇందుకోసం ముస్తఫా అంగీకరించాడు. బదులుగా తన లైంగిక వాంఛలను తీర్చుకోవాలనుకున్నాడు. వాషికి చెందిన ఈ నటి గోరెగావ్ స్టూడియోలో ముస్తఫాను కలుసుకుంది. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అయిదుసార్లు అత్యాచారం జరిపాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముస్తఫాను అరెస్టు చేశారు.


Click it and Unblock the Notifications












