twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్షన్ కోసం కిడ్నాప్ డ్రామా.. సినిమా కోసం పిచ్చి పని చేసి అరెస్ట్!

    |

    సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం, ఇక్కడ సక్సెస్ అయిన వారి కధలే బయటకు వస్తాయి కాబట్టి ఎలా అయినా సినిమాల్లోకి రావాల‌ని ఇప్పుడున్న స్టార్స్ లాగా వెలిగిపోవాలని ఎంతోమంది క‌ల‌లు కంటుంటారు. కొంత మంది ఆ క‌ల‌ను సాకారం చేసుకునేందుకు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డి ఏదో చేయాలనీ అనుకుంటారు. కానీ మరికొంత మంది తప్పుడుమార్గంలో వెళ్లి జీవితం నాశనం చేసుకుంటారు. సినిమా తీయాలని ఆసక్తితో ఉన్న 24 ఏళ్ల ఔత్సాహిక ద‌ర్శ‌కుడు దొడ్డిదారిన డ‌బ్బులు సంపాదించి షార్ట్ ఫిలిం తీయాల‌నుకున్నాడు. తీరా త‌న ప్లాన్ బెడిసికొట్ట‌డంతో పోలీసుల చేతికి చిక్కి ఫూల్ అయ్యాడు. ఆ వివరాల్లోకి వెళ్తే

     తనను కిడ్నాప్ చేసినట్లు

    తనను కిడ్నాప్ చేసినట్లు

    ఒక విచిత్రమైన సంఘటనలో, చెన్నైకి చెందిన 24 ఏళ్ల ఔత్సాహిక దర్శకుడు, తన షార్ట్ ఫిల్మ్ కోసం తన కుటుంబం నుంచి రూ. 30 లక్షలు లాక్కునే ప్రయత్నంలో తనను కిడ్నాప్ చేసినట్లు నాటకం ఆడినందుకు అరెస్టు చేయబడ్డాడు . అయితే పోలీసులు వార్నింగ్ ఇవ్వడంతో యువకుడిని తల్లిదండ్రులతో వెళ్లేందుకు అనుమతించారు.

    స్నేహితుల‌తో కిడ్నాప్ డ్రామా

    స్నేహితుల‌తో కిడ్నాప్ డ్రామా

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నైకి చెందిన 24 ఏళ్ల యువకుడు తన షార్ట్ ఫిల్మ్ కోసం తండ్రిని 30 లక్షలు కావాలని కోరాడు. అయితే తండ్రి పెన్సిల‌య్య‌ రూ.30 ల‌క్ష‌లు అంటే అంత‌మొత్తం ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తిర‌స్క‌రించి కేవ‌లం రూ.5 ల‌క్ష‌లు మాత్రం కొడుక్కి ఇచ్చాడు. అయితే ఎలా అయినా 30 లక్షలు సంపాదించాలని భావించిన ఆ యువకుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి కిడ్నాప్ డ్రామా ఆడాడు.

    కిడ్నాప్ అయ్యాడని

    కిడ్నాప్ అయ్యాడని

    తనకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించిన తన తండ్రి నుండి రూ.30 లక్షలు దోపిడీ చేయడానికి తనను తానే కిడ్నాప్ చేయించుకుని డ్రామా సృష్టించారు. చెన్నై ఐస్ హౌస్ ప్రాంతానికి చెందిన పెన్సిలయ్య తన కొడుకు కిడ్నాప్ అయ్యాడని మిస్టరీ కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు తన ప్రాజెక్ట్ కోసం ఫైనాన్షియల్ కన్సల్టింగ్ సంస్థలో పనిచేస్తున్న తన తండ్రి నుంచి ఇప్పటికే రూ.5 లక్షలు తీసుకున్నాడని తెలియసింది.

    కేసు న‌మోదు చేసుకుని

    కేసు న‌మోదు చేసుకుని

    నీ కొడుకుని కిడ్నాప్ చేశాం, 30 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ న‌గ‌దు ఇవ్వాల‌ని అతని స్నేహితులు డిమాండ్ చేశారు. అది కూడా తెలంగాణ‌కి తీసుకురావాల‌ని, ఈ విష‌యం పోలీసుల‌కు చెబితే చంపేస్తామ‌ని బెదిరించారు. దీనిపై పెన్సిల‌య్య పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

    ఫిర్యాదు అందిన వెంటనే

    ఫిర్యాదు అందిన వెంటనే

    పోలీసులకు ఫిర్యాదు అందిన వెంటనే వడపళని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ బాలమురుగన్‌ ఆధ్వర్యంలో నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్రచురితమైన కథనం ప్రకారం, సికింద్రాబాద్‌లోని ఒక హోటల్ నుండి పోలీసులు యువకుడిని అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

    కిడ్నాప్ డ్రామా ఆడి

    కిడ్నాప్ డ్రామా ఆడి


    "షార్ట్ ఫిల్మ్ ప్రాజెక్ట్ కోసం తన కుటుంబం నుండి డబ్బు సేకరించేందుకు తన సొంత కిడ్నాప్ డ్రామా ఆడినట్లు యువకుడు తన నేరాన్ని అంగీకరించాడు " అని పోలీసు అధికారి వెల్లడించారు. గురువారం ఇంటి నుండి బయలుదేరిన కుమారుడు వడపళనిలోని ఒక షాపింగ్ మాల్‌కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పాడు. ఆ రోజు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. అతని తల్లిదండ్రులకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చిందని తెలంగాణకు రూ.30 లక్షలు తీసుకురావాలని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడని, అదే విషయాన్ని పోలీసులకు తెలియజేయవద్దని హెచ్చరించాడని తేలింది.

    English summary
    Aspiring film director stages abduction drama to extract 30 lakh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X