వర్ధమాన నటుడి హత్య.. నిందితుడి అరెస్టు
పోలీసుల కథనం ప్రకారం... సుమిత్ త్యాగి అంబ్కేదర్‌నగర్‌లోని జోహరిపూర్‌లో ఉంటూ మోడలింగ్ వృత్తిలో పని చేసేవాడు. ఫిబ్రవరి 21న అక్షరధామ్ మందిరం వద్ద షూటింగ్ పూర్తి చేసుకుని తండ్రి రామేశ్వర్‌కు ఫోను చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. తరువాత అతను ఇంటికి చేరుకోలేదు. మూడు గంటల తరువాత గుర్తుతెలియని వ్యక్తులు ఫోను చేసి రూ. 2 లక్షలు ఇవ్వాలని లేకపోతే సుమిత్‌ను చంపేస్తామని బెదిరించారు.
దాంతో రామేశ్వర్ కరవల్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని రామేశ్వర్‌కు ఫోను చేసిన నంబరు ఎలక్ట్రానిక్ సర్వీలేన్స్ ద్వారా సేకరించడంతో లోకేషన్ మండవాలిలోని శాంతిదీప్ ఇంటికి చేరుకునప్పుడు తాళం వేసి ఉంది. తలుపులు పగులగొట్టి చూసేసరికి గదిలో సుమిత్ శవం కనిపించింది. నిందితుడు శాంతిదీప్ తప్పించుకు పారిపోయాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బహుచాయిగావ్‌లో నిందితుడ్ని అరెస్టు చేసి రాత్రి నగరానికి తీసుకుని వచ్చామని పోలీసులు వెల్లడించారు.


Click it and Unblock the Notifications












