twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్ధమాన నటుడి హత్య.. నిందితుడి అరెస్టు

    By Srikanya
    |

    న్యూఢిల్లీ : వర్దమాన నటుడు, మోడల్ సుమిత్‌ హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని నగర పోలీసులు ఉత్తర్‌ ప్రదేశ్‌లో అరెస్టు చేశారు. అతనికి పరిచయమున్న వ్యక్తే ఈ దారణానికి పాల్పడటం చాలా మందిని విస్మయపరిచింది. కిడ్నాప్ గా మొదలైన ఈ ఉదతం,చివరకు హత్యగా ముగిసి,అందరినీ విషాదంలో ముంచిది.

    పోలీసుల కథనం ప్రకారం... సుమిత్‌ త్యాగి అంబ్కేదర్‌నగర్‌లోని జోహరిపూర్‌లో ఉంటూ మోడలింగ్‌ వృత్తిలో పని చేసేవాడు. ఫిబ్రవరి 21న అక్షరధామ్‌ మందిరం వద్ద షూటింగ్‌ పూర్తి చేసుకుని తండ్రి రామేశ్వర్‌కు ఫోను చేసి ఇంటికి వస్తున్నానని చెప్పాడు. తరువాత అతను ఇంటికి చేరుకోలేదు. మూడు గంటల తరువాత గుర్తుతెలియని వ్యక్తులు ఫోను చేసి రూ. 2 లక్షలు ఇవ్వాలని లేకపోతే సుమిత్‌ను చంపేస్తామని బెదిరించారు.

    దాంతో రామేశ్వర్‌ కరవల్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసుకుని రామేశ్వర్‌కు ఫోను చేసిన నంబరు ఎలక్ట్రానిక్‌ సర్వీలేన్స్‌ ద్వారా సేకరించడంతో లోకేషన్‌ మండవాలిలోని శాంతిదీప్‌ ఇంటికి చేరుకునప్పుడు తాళం వేసి ఉంది. తలుపులు పగులగొట్టి చూసేసరికి గదిలో సుమిత్‌ శవం కనిపించింది. నిందితుడు శాంతిదీప్‌ తప్పించుకు పారిపోయాడు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బహుచాయిగావ్‌లో నిందితుడ్ని అరెస్టు చేసి రాత్రి నగరానికి తీసుకుని వచ్చామని పోలీసులు వెల్లడించారు.

    English summary
    A 21-year-old aspiring actor was murdered here by his arrested script writer friend for Rs.2 lakh, police said Monday. Shanti Deep Verma, 31, an alumnus of Film and Television Institute of India, Pune, killed Sumit Tewari as he needed money, police said after questioning the accused. Verma was arrested 10 days after the body of victim Tewari was recovered Feb 23 from the former's house in Mandawali in east Delhi, police said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X