ప్రభాస్‌కు పోలీసుల ఝలక్.. మాస్క్ ధరించరా? వైరల్‌గా రాధేశ్యామ్ మార్ఫింగ్ పోస్టర్‌

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, అందాల తార పూజా హెగ్డే కలిసి నటిస్తున్న రాధే శ్యామ్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ రిలీజై సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నది. సాహో తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే అసోం పోలీసులు చేసిన పనికి ఈ సినిమా పోస్టర్‌ ప్రస్తుతం మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకు అసోం పోలీసులు చేసిన పని ఏమిటంటే..

 అసోం పోలీసులు మార్ఫింగ్‌

అసోం పోలీసులు మార్ఫింగ్‌

తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజైన రాధేశ్యామ్ సినిమా పోస్టర్‌ అసోం పోలీసులను ఆకర్షించింది. కోవిడ్ 19 నిబంధలకు అనుగుణంగా లేదనే విషయాన్ని గ్రహించిన నాగావ్ పోలీసులు ఆ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసి.. మాస్క్ ధరించిన పోస్టర్‌ను రిలీజ్ చేయాలని సూచించడానికి ప్రభాస్‌ను సంప్రదించగా.. సాధ్యం కాలేదు అని తెలిసింది.

రాధేశ్యామ్ పోస్టర్‌ను ట్విట్టర్‌లోకి

రాధేశ్యామ్ పోస్టర్‌ను ట్విట్టర్‌లోకి

కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో రాధేశ్యామ్ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసి నాగావ్ పోలీసులు తమ ట్విట్టర్‌లో పోస్టు చేసి ఓ కామెంట్‌ను కూడా పెట్టారు. మీకు ప్రియాతి ప్రియమైన వ్యక్తులు బయటకు వెళ్లుంటే... తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పండి. మేము అదే విషయాన్ని ప్రభాస్ తెలియజేయడానికి ప్రయత్నించాం. కానీ ఆయనను చేరుకోలేకపోయాం. ఇప్పుడు ఫోటోషాప్‌ ద్వారా ఫోటోను మార్ఫింగ్ చేసి ఆయనకు మెసేజ్ పంపుతున్నాం అని నాగావో పోలీసులు పేర్కొన్నారు.

రికార్డు ట్వీట్లతో రాధేశ్యామ్ పోస్టర్

రికార్డు ట్వీట్లతో రాధేశ్యామ్ పోస్టర్

జూలై 10వ తేదీన రిలీజ్ చేసిన రాధేశ్యామ్ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కు భారీగా స్పందన లభించింది. సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పోస్టర్‌ కొద్దిగంటల్లోనే రూ.3.8 మిలియన్ల ట్వీట్స్‌ను సొంతం చేసుకొన్నది. ప్రభాస్ కెరీర్‌లోనే ఇది ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు.

Recommended Video

Prabhas20 Title Announcement In August, Fans Frustration Peaks
2021లో రిలీజ్ చేయాలని

2021లో రిలీజ్ చేయాలని

అత్యంత ప్రతిష్టాత్మకంగా, విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటున్న రాధేశ్యామ్ చిత్రంలో బాలీవుడ్ నటి భాగ్యశ్రీ, మురళీశర్మ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి, సాసా చెట్రీ, కునాల్ రాయ్ కపూర్, సత్యన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫిని, ఆర్ రవిందర్ రెడ్డి ఆర్ట్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2021లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X