దొంగనోట్ల కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్

సినిమారంగంలో పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన భూపతితేజ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేసారు. అతని వద్ద నుండి దాదాపు రూ. 4 లక్షల విలువ చేసే డూప్లికేట్ కరెన్సీని పట్టుకున్నారు. అతనితో పాటు మరో ఏడుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేసారు.
వీరికి దొంగనోట్లు ఎలా వచ్చాయి, వాటిని ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ దొంగనోట్ల రాకెట్ వెనక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వీరిని విశాఖ పోలీసు కమీషనరేట్లో ఉంచిన పోలీసులు తమదైన పద్దతుల్లో విచారణ కొనసాగిస్తున్నారు.
ఈ దొంగనోట్ల రాకెట్లో కీలక నిందితుడుగా ఉన్న భూపతితేజతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? సినీ రంగానికి చెందిన ప్రముఖులుగానీ, రాజకీయ రంగానికి చెందిన వారికి గానీ ఇందులో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పోలీసులు అన్ని విషయాలు బయట పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications