అసిస్టెంట్ డైరెక్టర్‌కి కత్తి పోట్లు

గాయపడ్డ ఉదయ్ వెంటనే అతని స్నేహితులకు ఫోన్ చేయడంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఉదయ భాస్కర్ పై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడింది ఎవరు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. సంఘటన స్థలంలో ఉన్న పలువురిని ఈ విషయమై అడిగినట్లు తెలుస్తోంది. ఉదయ్ భాస్కర్ కు శత్రువులు ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











