భార్యతో గొడవపడ్డ అనుష్క డైరెక్టర్....రచ్చకెక్కి పోలీసుల దాకా!
హైదరాబాద్: అనుష్క నటించిన అరుంధతి చిత్రంతో పాటు పలు చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేసిన హరికృష్ణ తన భార్యతో గొడవ పడిన వ్యవహారం రచ్చకెక్కి పోలీసు కేసుల వరకు వెళ్లింది. తనను మానసికంగా వేదిస్తున్నాడని, అదనపు కట్నం కోసం హరికృష్ణ భార్య శ్రీలేఖ మానసికంగా ఆరోపిస్తుంటే, హరికృష్ణ వాదన మాత్రం మరోలా ఉంది. తన పరువు తీసేందుకు ఆమె ఇలా చేస్తోందని అతను వాదిస్తున్నాడు.
హరికృష్ణ వివాహం రెండేళ్ల క్రితం నెల్లూరు జిల్లా వాకాడుకు చెందిన శ్రీలేఖతో జరిగింది. ఈ దంపతులకు ఏడాదిన్నర పాప కూడా ఉంది. కాగా పెళ్లైన ఏడాది నుంచే రెండో పెళ్లి చేసుకుంటానని హరికృష్ణ వేధించసాగాడని, తర్వాత పాపను తన వద్దే పెట్టుకుని తనను ఇంటి నుంచి గెంటేశాడని భార్య శ్రీలేఖ ఆరోపిస్తోంది. ఈ మేరకు శ్రీలేఖ నెల్లూరు జిల్లా వాకాడు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

శుక్రవారం శ్రీలేఖ తన భర్త నివాసానికి వెళ్లగా అక్కడ భర్త, పాప ఎవరూ లేరు. ఆమె వస్తున్న విషయం తెలుసుకుని హరికృష్ణ అక్కడి నుండి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో తనకు న్యాయం చేయాలని, పాపను తనకు ఇప్పించాలని కోరుతూ భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీలేఖ నుంచి వివరాలు సేకరించారు.
దీనిపై హరికృష్ణ స్పందిస్తూ......తన పేరు పాడు చేసేందుకే శ్రీలేఖ ఇలా చేస్తోందని, కావాలంటే పాపను ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకు పోలీసులు, కేసులంటూ హడావుడి చేయాల్సిన అవసరం లేదన్నారు. తీవ్ర జ్వరంతో ఉన్న పాపను ఆమె ఆస్పత్రికి కూడా తీసుకు వెళ్లలేదని, దాంతో పాప కోమాలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో తిట్టానని ఆమె అలిగి పాపను వదిలేసి పుట్టించికి వెళ్లిపోయిందన్నారు. అంతకు మించి ఏమీ జరుగలేదని హరికృష్ణ అంటున్నారు. చివరకు పాపను హరికృష్ణ పోలీసులకు అప్పజెప్పడంతో శ్రీలేఖ ఆందోళన విరమించింది.


Click it and Unblock the Notifications











