డ్రగ్ కేసు గురించి 'అష్టా చెమ్మ' నాని ఓపెన్ ఛాలెంజ్
డ్రగ్ మాఫియా కేసులో 'అష్టాచెమ్మ' నాని కూడా ఉన్నారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేఫద్యంలో ఆయన వాటిని ఖండిస్తున్నారు. ఈ వివాదంతో తనకేమీ సంభందం లేకుండా వార్తలు ప్రసారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేసారు. అలాగే ఇలా కన్ఫర్మ్ చేసుకోకుండా వచ్చే వార్తలు వల్ల పర్శనల్ లైఫ్ కి ఎఫెక్టు అవుతాయని, తమ కుటుంబాలు వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. అలాగే తనను పరీక్ష చేసుకోమని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. డ్రగ్స్ తీసుకుంటే మినిమం ఆరు నెలలు శరీరంలో వాటికి సంభందించినవి ఉంటాయని ఏ తరహా పరీక్షలుకైనా సిద్దమేనని అన్నారు. అలాగే అసెస్టెంట్ డైరక్టర్ స్ధాయి నుంచి వచ్చిన తాను నటుడుగా ఎదుగుతున్నానని, సినిమా తప్ప తనకు వేరే ధ్యాస అనేది లేదని నాని అన్నారు. అలాగే పబ్ యజమానులు వచ్చి తనను ఆహ్వానించినా కూడా తాను ఎప్పుడూ వెళ్ళలేదని, తను ఎప్పుడూ డ్రగ్ రుచి చూడలేదని అన్నాడు.


Click it and Unblock the Notifications











