»   » అఖిల్ పెళ్లిపై షాకిచ్చిన జ్యోతిష్కుడు, చైతూపై కూడా బాంబు పేల్చాడు!

అఖిల్ పెళ్లిపై షాకిచ్చిన జ్యోతిష్కుడు, చైతూపై కూడా బాంబు పేల్చాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అఖిల్ పెళ్ళికి ఎంగేజ్మెంట్ అయిపోయి, వెన్యూ సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు క్యాన్సిల్ అయ్యిందని వస్తున్న వార్తలు టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. అక్కినేని అఖిల్, జివికె వారి మనువరాలు శ్రీయ భూపాల్ లకు గత డిసెంబర్ లో ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే.

నిన్నటి నుంచి ఫిల్మ్ సర్కిల్స్ లో మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ వివాహం ఆగిపోయిందా? అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా డెస్టినేషన్ మ్యారేజ్ కు చెందిన ...రోమ్‌ ప్రయాణాన్ని కేన్సిల్‌ చేసుకోవాలంటూ గత శనివారం సన్నిహితులకు సమాచారం వెళ్లిందని దానితోనే ఈ వార్త బయిటకు వచ్చినట్లు చెప్తున్నారు

rn

అభిప్రాయ భేదాలు:


అయితే పెళ్లి రద్దుకు కారణం మాత్రం చెప్పలేదని తెలిసింది. పెళ్లి రద్దు నిర్ణయం శ్రియ కుటుంబం నుంచే వచ్చిందని ప్రచారం జరుగుతోంది. దాంతో అఖిల్‌ పెళ్లి రద్దు వార్త వినిపించడంతో ఏం జరిగి ఉంటుందనే దానిపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల్‌, శ్రియ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనీ, డెస్టినేషన వెడ్డింగ్‌ ఏర్పాట్ల విషయంలో తేడాలొచ్చాయనీ వినిపిస్తోంది. ఏదేమైనా ఈ వ్యవహారంతో నాగార్జున బాగా కలత చెందినట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

 షాకింగ్ న్యూస్:

షాకింగ్ న్యూస్:


ఒకపక్క పెళ్ళికి సంబంధించి ఇటలీలోని ఒక నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. వెన్యూ ఫైనల్ చేయడం.. గెస్టులకు రూములు ఎలాట్ చేయడం.. ఇండియా నుంచి అక్కడికి చేరుకోవడానికి కావల్సిన ఎయిర్ టిక్కెటింగ్ వగైరా పనులన్నీ జరిగిపోతున్నాయి. అంతలోనే ఈ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 వెడ్డింగ్ రిలేషన్షిప్ క్యాన్సిల్:

వెడ్డింగ్ రిలేషన్షిప్ క్యాన్సిల్:


సడన్ గా అందరినీ ఈ ఎయిర్ టిక్కెట్లు, ఇతర ఏర్పాట్లను క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ జివికె, అక్కినేని ఫ్యామిలీల నుంచి రిక్వెస్టులు వచ్చినట్లు రూమర్లు షికారు చేస్తున్నాయి. దానికితోడు ఈ వెడ్డింగ్ రిలేషన్షిప్ క్యాన్సిల్ అయిపోయినట్లు ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్' ‘టైమ్స్ ఆఫ్ ఇండియా' పత్రికల ఆన్ లైన్ ఎడిషన్లో వార్తలు వచ్చేశాయి.

 అఖిల్,శ్రేయ భూపాల్ :

అఖిల్,శ్రేయ భూపాల్ :


అయితే పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత క్యాన్సిల్ అవ్వడం ఏంటని అది ఇద్దరూ ప్రేమించుకున్నవారే కదా ఇలా జరిగింది ఏంటని ఆశ్చర్యపోయారట.ఇక వీరి పెళ్ళి క్యాన్సిల్ అవ్వడానికి కారణం అఖిల్,శ్రేయ భూపాల్ కు మధ్య ఏవో విభేధాలు వచ్చాయని దీంతో అది కాస్త పెద్దది అవ్వడం పెళ్ళి క్యాన్సిల్ చేశారట.ఇక ఈ విషయమై నాగ్ కూడా చాలా భాధ పడ్డాడట.అందుకే వీరి పెళ్ళి క్యాన్సిల్ అయ్యిందని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

 ముందే చెప్పాడట:

ముందే చెప్పాడట:


ఇదంతా ఒకేత్తయితే అసలు అఖిల్ పెళ్ళి ఆగిపోవటానికి కారణం అఖిల్ జాతక ప్రభావమేననీ చెప్తున్నాడొక జ్యోతీష్కులు, అంతే కాదు ఎంగేజ్ మెంట్ కి ముందే ఈ పెళ్ళి నిలబడదనీ, నిశ్చితార్థం తర్వాత ఆగిపోవటం లేదా, పెళ్ళి అయ్యాక అయినా విడిపోవటం జరుగుతుందని ముందే చెప్పాడట. ఆయన చెప్పినట్టు నిజంగానే ఈ పెళ్ళి ఆగిపోయిందంటూ వార్థలు రావటం తో ఆయన ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోతోంది.

 ఓమ్ ఫట్ అనే యూట్యూబ్ చానల్:

ఓమ్ ఫట్ అనే యూట్యూబ్ చానల్:


ఇక ఓమ్ ఫట్ అనే యూట్యూబ్ చానల్ లో వచ్చిన వీడియో లో ఆయన అఖిల్ జాతక చక్రం వేసి మరీ వివరంగా చెప్పారు. ఆ జాతకం ప్రకారం శ్రియ అఖిల్ ల పెళ్ళి జరిగే అవకాశమే లేదనీ ఒక వేళ జరిగినా ఆ వివాహం ఎక్కువ కాలం నిలబడదనీ చెప్తున్నారు. ఇంతే కాదు అఖిల్ జాతకం లోనే కాదు నాగ చైతన్య జాతకం లో కూడా ఈ దోషమే ఉందని బాంబు పేల్చాడు... ఈ న్యూస్ నాగ్ కి చేరిందో లేదో గానీ సమంతా కి తెలిస్తే ఎలా ఉంటుందో మరి....

English summary
This Astrologer predicted About Nagarjuna’s son Akhil Akkineni’s marriage to Shriya Bhupal called off., watch the video once
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu