సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా Sreeleela.. అప్పటివరకు తిరుగుండదు.. సంచలన విషయాలు చెప్పిన వేణుస్వామి

ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన సెలబ్రేటీల జాతకం చెబుతూ.. ఆయన కూడా ఓ సెలబ్రేటీ అయిపోయాడు. ముఖ్యంగా ఆయన చెబితే 99శాతం వాస్తవాలుగా ఉంటున్నాయి. గతంలో చెప్పిన ఆయన వీడియోలు... ప్రస్తుత సంఘటనలకు కనెక్ట్ చేస్తూ.. ఆయన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే తెలుగులో టాప్ హీరోయిన్ గా మారిన శ్రీలీల గురించి వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే...

వంద కోట్ల హీరోయిన్: టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల.. వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా శ్రీలీల మారిపోయింది. చేసింది రెండు సినిమాలే అయినా.. చేతిలో మాత్రం వరుస సినిమాల ఆఫర్లతో దూసుకెళ్తోంది. యంగ్ హీరోల నుంచి స్టార్ కథానాయకుల వరకు అన్నీ చిత్రాల్లో శ్రీలీలకు ఛాన్స్ లు క్యూ కడుతున్నాయి. 'పెళ్లిసందడి'తో ఎంట్రీ ఇచ్చి .. 'ధమాకా' సినిమాతో 100 కోట్ల హీరోయిన్ గా మారిన శ్రీలీల... అప్పటినుంచి ఆమెకు అదృష్టం వెంట నడుస్తోంది.

Astrologer Venu Swamy made Reveals Heroine Sreeleela Horoscope and video viral in social media

వేణుస్వామి కీలక వ్యాఖ్యలు: అయితే ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి.. సెలబ్రేటీల జాతకం చెబుతూ.. ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. గతంలో నయనతార, సమంత నాగ చైతన్య వంటి ప్రముఖల జాతకాలు చెప్పి... బాగా ఫేమస్ అయ్యాడు. అంతే కాదు.. నరేష్ జాతకం కూడా చెప్పుకొచ్చాడు. దాదాపు ఆయన చెప్పేవి 99శాతం వాస్తవాలుగా ఉంటున్నాయి. దీనితో ఆయనకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి వేణు స్వామి కీలక వ్యాఖ్యలు చేశాడు.

Astrologer Venu Swamy made Reveals Heroine Sreeleela Horoscope and video viral in social media

అప్పటివరకు శ్రీలీలదే హవా: దక్షిణ భారతదేశంలోనే శ్రీలీల.. టాప్ హీరోయిన్ గా కొనసాగుతుందని సంచనల వ్యాఖ్యలు చేశాడు. వేణుస్వామి శ్రీలీల గురించి మాట్లాడుతూ... ''శ్రీలీల జాతక రిత్యా మీన రాశి. ఈ జాతకాన్ని నేను విశ్లేషించాను. ఆమె జాతకంలో రాజ యోగం ఉంది. విపరీతమైన పేరు, ప్రఖ్యాతలు, విపరీతమైన ఆదాయం, విపరీతమైన అవకాశాలు.. ఈమె జాతకంలో ఉంది. 2028వ సంవత్సరం వరకు శ్రీలీలదే హవా.

Astrologer Venu Swamy made Reveals Heroine Sreeleela Horoscope and video viral in social media

శ్రీలీలకు రాజయోగం: ఈమెది చాలా గొప్ప జాతకం. నయనతార జాతకానికి దగ్గరగా ఉండే జాతకం. ఈమె ఎక్కువ కాలం హీరోయిన్ గా ఉంటుంది. అందరి హీరోయిన్ల స్థానాలను ఈమె అక్రమించేస్తుంది. పూజా హెగ్డే, సమంత, రష్మిక వీరి స్థానాలను ఈమె కైవసం చేసుకోనుంది. దాదాపు 6,7 సంవత్సరాల పాటు టాలీవుడ్ ఏలేది ఈమెనే. టాలీవుడ్ తో పాటు.. రెండు, మూడు సౌత్ భాషల్లో ఈమెనే నంబర్ వన్ గా ఉంటుంది. ఈమె జాతకానికి రాజయోగం ఉంది.'' అని చెప్పుకొచ్చాడు.

Astrologer Venu Swamy made Reveals Heroine Sreeleela Horoscope and video viral in social media

శ్రీలీలే టాప్ హీరోయిన్: వేణుస్వామి చెప్పినట్లుగానే శ్రీలీల కెరియర్ ఓ సారి చూస్తే.. ఆమె చేతిలో దాదాపు 10 నుంచి 15 సినిమాలు చేతిలో ఉన్నాయి. బాలయ్య, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, నితిన్, విజయ్ దేవరకొండ, నార్నె నితిన్, అల్లు అర్జున్, రామ్ పోతినేని, మోక్షజ్ఞ, వైష్ణవ్ తేజ్ వంటి హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తోంది. డై అండ్ నైట్ విరామం లేకుండా సినిమా షూటింగ్స్ లో శ్రీలీల పాల్గొంటుంది. అయితే రాబోయే సౌత్ టాప్ హీరోయిన్ శ్రీలీలే అని అర్థం అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X