Balakrishna కొడుకు మోక్షజ్ఞపై బాంబు పేల్చిన వేణుస్వామి... టెన్షన్‌లో అభిమానులు!
బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ గురించి ఈ మధ్యకాలంలో చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమా రంగం ఎంట్రీపై నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తారా? అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి... మోక్షజ్ఞ తేజ గురించి, ఆయన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
నందమూరి తారకరామారావు వారసుడిగా బాలకృష్ణ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కి తగ్గ కొడుకుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును బాలకృష్ణ తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఆయన వారసుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది. ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తారని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. కానీ ఇప్పట్లో ఆయన ఎంట్రీ ఇచ్చేటట్లు కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి.. మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఆయన ఇది వరకు సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టి పూజలు చేసేవారు. ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రెటీల గురించి జాతకాలు చెబుతూ హీరో హీరోయిన్ రేంజులో ఫేమస్ అయిపోయారు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.

ఆ విషయం పక్కన పెడితే వేణు స్వామి... సమంత, నాగచైతన్య విడాకుల గురించి ముందుగానే చెప్పి... బాగా పాపులర్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ అఖండ సినిమా సమయంలో వేణు స్వామి అక్కడికి వెళ్లి బాలకృష్ణని కలిసినట్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయనతో పాటు మోక్షజ్ఞను కూడా కలిసినట్లు చెప్పారు. అయితే ఇంటర్వ్యూ చేసే యాంకర్ వేణు స్వామిని ఓ ప్రశ్న అడిగింది.

మోక్షజ్ఞ జాతకం చూశారా? అని వేణు స్వామిని అడగ్గా... దీనికి ఆయన ఎందుకు చూడలేదు.. చూశాను. మోక్షజ్ఞ జీవితం చాలా బాగుంది. ఆయన సినీ కెరియర్ ఇంకా బాగుంటుంది. అయితే ఆయన ఎంట్రీ ఇప్పట్లో ఉండకపోవచ్చు. దాదాపు రెండు మూడేళ్లు పడుతుండొచ్చు అంటూ బాంబు పేల్చారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా రెండు, మూడు ఏళ్లు అంటే ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.
వేణు స్వామి... మోక్షజ్ఞ గురించి మాట్లాడుతూ సినిమాల్లో అయితే బాగానే రాణిస్తారు. కానీ రాజకీయాల జోలికి పోరు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. మరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి ఇంకా సమయం ఉన్నట్లు అర్థమవుతుంది. చూడాలి ఒకవేళ ముందుగానే వస్తే ఫ్యాన్స్ కు మాత్రం పండగే అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











