ప్రభాస్‌ జాతకంలో లోపం.. ఫ్యాన్స్ భయపడేలా ఆధారాలతో: మరోసారి వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు

రెబెల్ స్టార్ కృష్ణంరాజు కుటుంబం నుంచి హీరోగా పరిచయం అయినా.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదిగిపోయాడు ప్రభాస్. చాలా కాలం పాటు తెలుగులో మాత్రమే సినిమాలు చేసిన అతడు.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' తర్వాత నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు.

అంతేకాదు, అప్పటి నుంచి ఏక కాలంలో వరుసగా అన్నీ భారీ సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా సత్తా చాటుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభాస్ జాతకంపై వేణు స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలను మీరే చూసేయండి!

Astrologer Venu Swamy Once Again Sensational Comments on Prabhas Astrology

వరుస చిత్రాలు చేసినా షాక్: 'బాహుబలి' సిరీస్ తర్వాత రెబెల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే, దీని తర్వాత అతడి ప్రయాణం ఆశించిన రీతిలో సక్సెస్‌ఫుల్‌గా సాగడం లేదు. దీనికి కారణం అతడు నటించిన 'సాహో', 'రాధే శ్యామ్', 'ఆదిపురుష్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ ప్రభాస్ వరుస సినిమాలతో సత్తా చాటుతూనే ఉన్నాడు.

Astrologer Venu Swamy Once Again Sensational Comments on Prabhas Astrology

సలార్‌తో మరోసారి ట్రాక్‌లో: ఎన్నో సినిమాలు చేసినా సక్సెస్‌ను సొంతం చేసుకోలేకపోయిన రెబెల్ స్టార్ ప్రభాస్.. గత ఏడాది 'సలార్: సీజ్‌ఫైర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వైల్డ్ యాక్షన్‌తో రూపొందిన ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. తద్వారా ప్రభాస్‌కు చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్‌ను ఈ సినిమా అందించింది.

Astrologer Venu Swamy Once Again Sensational Comments on Prabhas Astrology

ఇప్పుడు ఆ మూవీలతో బిజీ: హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ప్రభాస్.. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం అతడు 'కల్కి 2898 ఏడీ', 'సలార్ పార్ట్ 2', 'ది రాజా సాబ్', 'స్పిరిట్' సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మరోసారి ప్రభాస్ జాతకం: పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోన్న ప్రభాస్ జాతకం ఆ మధ్య హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దీనికి కారణం ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి అతడి జాతకంలో లోపాలు ఉన్నాయని, సినిమాలతో పాటు పర్సనల్ లైఫ్‌లో ఇబ్బందులు వస్తాయని చెప్పడమే. అలాగే ప్రభాస్ ఆరోగ్యంపైన కూడా కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన దీనిపై మాట్లాడారు.

Astrologer Venu Swamy Once Again Sensational Comments on Prabhas Astrology

మరోసారి సంచలనంగానే: గతంలో ప్రభాస్ జాతకంలో లోపాలు ఉన్నాయని చెప్పి షాకిచ్చిన వేణు స్వామి.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆధారాలను కూడా బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. 'నా పాత వీడియోలు చూడండి.. ఆదిపురుష్ ఫ్లాప్ అని చెప్పినట్లు అయింది. సలార్ ఫ్యాన్స్ తప్ప ఎవరూ చూడరు అన్నాను. ఆ సినిమా కూడా అలాగే ఉంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రభాస్ జాతకం బాలేదని: అదే ఇంటర్వ్యూలో వేణు స్వామి కంటిన్యూ చేస్తూ.. 'ప్రభాస్ సినిమాల విషయంలో నేను చెప్పినట్లే జరిగింది. భారతదేశంలోనే నాలాంటి మగాడు లేడు. ఇప్పుడు కూడా చెబుతున్నాను.. ప్రభాస్ జాతకం అసలు ఏమాత్రం బాలేదు' అంటూ స్పష్టం చేశారు. దీంతో వేణు స్వామి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X