వైఎస్ జగన్‌ను ఓడగొట్టి.. పవన్ కల్యాణ్ సీఎంగా.. వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!
తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు, జోతిష్యం చెబుతూ సంచలన కామెంట్స్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి. ఆయన చెప్పే కొన్ని వివాదాస్పదంగా, మరికొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. సినీ తారల జీవితాలను టార్గెట్ చేసుకొని ఆయన చెప్పే జోతిష్యం ట్రెండింగ్, ట్రోలింగ్ అవుతుంటాయి. అలాంటి వేణుస్వామి.. తాజాగా పవన్ కల్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల్లోకి వెళితే..
ఎవరి మాట వినరు: పవన్ కల్యాణ్‌కు సలహాలు ఇచ్చే దమ్ము ఎవరికీ లేదు. ఆయన ఎవరి మాటలు వినరు. నేను పవన్ కల్యాణ్ గురించి మంచి చెప్పినా ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు. మంచి చెప్పినప్పుడు గ్రహించాలి. ఎదుటివాళ్లు ఎందుకు చెబుతున్నారో అర్దం చేసుకోవాలి అని వేణుస్వామి అన్నారు.

పవన్ కల్యాణ్ అంటే ఇష్టం: పవన్ కల్యాణ్ అంటే నాకు పిచ్చి. ఆయన బాగుపడాలని కోరుకొనే వాళ్లలో నేను ఒకరిని. ఆయన నటించిన 10 సినిమాలకు ముహుర్తం పెట్టినా.. ఆయనతో గంటలు గంటలు గడిపాను. నాకు చాలా ఇష్టం. ఆయనపై ఇష్టం వేరు. నాకు తెలిసిన ప్రతీ వ్యక్తి అభివృద్దిలోకి రావాలి. నా కోరిక అదే తప్పా.. నాకు శత్రువులు మిత్రులు లేరు అని వేణు స్వామి స్పష్టం చేశారు.
సీఎం కావాలని కోరుకొంటాను: పవన్ బాగుపడాలని కోరుకొంటాను. వైఎస్ జగన్‌ను ఓడగొట్టి సీఎం పవన్ కల్యాణ్ కావాలని కోరుకొంటాను. కానీ ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని కోరుకోను. ఆయన ముక్కుసూటి మనస్తత్వం. సంకుచిత, కుటిల రాజకీయాలు తెలియవు. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు. ఆ విషయం చెబితే అభిమానులు అపార్థం చేసుకొని ట్రోల్ చేస్తారు అని వేణు స్వామి అన్నారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ ట్రోలింగ్: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నన్ను పాజిటివ్‌గా ట్రోల్ చేశారు. మూడు పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే.. అలా మాట్లాడటం తప్పు.. మూడు కాదు..30 పెళ్లిళ్లు చేసుకొంటాడు. కావాలంటే నువ్వు చేసుకోమని చెప్పిన వీడియోను పవర్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేను పవన్ అభిమానిని. జల్సా సినిమా చూసి పేపర్లు చింపి వేసినోడినే. ఆయనకు సినిమాల్లో తిరుగులేదు. రాజకీయంలోనే కష్టం. పవన్ లైఫ్ రజనీకాంత్ మాదిరిగా ఉంటుంది.
మూడో భార్యకు విడాకులపై: పవన్ కల్యాణ్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చే అవకాశం జూన్ 2024 వరకు లేదు. జాతకం ప్రకారం అలాంటిది జరిగే అవకాశం లేదు. ఆది ఆయన వ్యక్తిగత అంశం. రాజకీయంగా నేను చూడటం లేదు. ఎలక్షన్ల వరకు విడాకులు సమస్యే లేదు. ఆ తర్వాత చెప్పలేం. కానీ ఆయన జీవితంలో ఇంకా వివాదాలు ఉన్నాయి. ఏం జరుగుతుందో చెప్పలేం అని వేణుస్వామి జోస్యం చెప్పారు.


Click it and Unblock the Notifications











