అందువల్లే విజయ్ దేవరకొండ, ఫ్యామిలీ స్టార్ సర్వనాశనం..గుంటూరు కారంకు కూడా అదే గతి.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
సినీ తారలకు సంబంధించిన జ్యోతిష్యం చెప్పే ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన రీతిలో తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. స్టార్ హీరోలు, హీరోయిన్‌ల జాతకాలను విశ్లేషిస్తూ కొన్నిసార్లు అభిమానుల ప్రశంసలు అందుకొంటారు. మరికొన్ని సార్లు ఫ్యాన్స్ నుంచి దారుణంగా ట్రోలింగ్ గురి అవుతుంటారు. గతంలో ప్రభాస్, నయనతార లాంటి సినీ ప్రముఖుల జాతకాలను చెప్పిన ఆయన తాజాగా విజయ్ దేవరకొండపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వాఖ్యల వివరాల్లోకి వెళితే..
తాను ఎవరి జాతకమైనా చెప్పినప్పుడు కీడు ఎంచి మేలు చెప్పమనే విధంగా ఉంటాను. ముందు వారికి జరగబోయే నష్టాన్ని తెలియజేస్తే చాలా మందికి నాపై కోపం. నాపై అనవసరంగా విరుచుకుపడుతారు. కానీ నేను చెప్పే విషయాల్లో వాస్తవం గ్రహించరు. అలా ట్రోలింగ్ చేస్తే నాకేమి నష్టం జరగదు అని వేణు స్వామి అన్నారు.

సాధారణంగా ఫ్లయిట్‌లో ప్రయాణించే ముందు ఎయిర్ హోస్టెస్ ఏదైనా ప్రమాదం, ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతారు. ఫ్లయిట్ కూలిపోతే.. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ అందకపోతే అంటూ సూచనలు ఇస్తుంటారు. విమానంలో ప్రమాదం చేద్దామని వెళితే.. ఇలాంటి అశుభాలు, అపశకునాలు చెబితే వారిని ఏమీ అనరు. కానీ నేను జాగ్రత్తలు చెబితే నన్ను గట్టిగా వేసుకొంటారు అని వేణుస్వామి తెలిపారు.
అయితే గుంటూరు కారం సినిమాపై నెటిగివ్ రివ్యూలు ఇచ్చి ఆ సినిమాను ప్లాప్ చేశారు. ఆ సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్, డిజాస్టర్ అంటూ వీడియో రివ్యూలు పోస్టు చేసి ఆ సినిమాను నాశనం చేశారు. ఇలా ట్రోలింగ్ వల్లే మహేష్ బాబు సినిమాను ఫ్లాప్ అయ్యేందుకు కారణమయ్యారు. మీరు నమ్మిన నమ్మకున్నా కావాల్సుకొని ఫెయిల్యూర్ అని చూపించారు అని వేణు స్వామి అన్నారు.

తాజాగా విజయ్ దేవరకొండకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆయన నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు పెట్టారు. ట్రోలర్స్, మీమర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు బలైన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఆయన సినిమా నాశనం కావడానికి కారణం వాళ్లే. సినిమా బయటకు రాకముందే మొత్తం.. అన్ని చోట్ల బాగాలేదు బాగాలేదు అని రివ్యూలు పెట్టారు. దాంతో మౌత్ పబ్లిసిటీ కారణంగా సినిమా చూడాలనుకొన్న వారు కూడా వెళ్లడం లేదు అని వేణుస్వామి అన్నారు.
ఇదిలా ఉంటే.. గత కొద్దికాలంగా విజయ్ దేవరకొండను వాంటెడ్‌గా టార్గెట్ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తున్నది. లైగర్, ఫ్యామిలీ స్టార్ సినిమాల రిలీజ్‌కు ముందే నెగిటివ్ రివ్యూలు పోస్టు చేశారు. దాంతో ఆయన కెరీర్, సినిమాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నదనే వాదన సినీ వర్గాల్లో ఉంది.


Click it and Unblock the Notifications











